Missing Cases: హైదరాబాద్ నగరంలో మరో మిస్సింగ్ కేసు.. బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్తున్నాన‌ని చెప్పి..

హైదరాబాద్ నగరంలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. చిక్కడ్‌పల్లికి చెందిన మహిళా టెక్కీ మిస్సింగ్ ఆందోళనకు గురిచేస్తోంది. దోమల్‌గూడకి చెందిన భార్గవి నగరంలోని..

Missing Cases: హైదరాబాద్ నగరంలో మరో మిస్సింగ్ కేసు.. బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్తున్నాన‌ని చెప్పి..
Bhargavi

Updated on: Nov 12, 2021 | 1:02 PM

హైదరాబాద్ నగరంలో మరో మిస్సింగ్ కేసు నమోదైంది. చిక్కడ్‌పల్లికి చెందిన మహిళా టెక్కీ మిస్సింగ్ ఆందోళనకు గురిచేస్తోంది. దోమల్‌గూడకి చెందిన భార్గవి నగరంలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. బుధవారం సాయంత్రం బ్యూటీపార్లర్‌కి వెళ్తున్నానని చెప్పిన ఇంటి నుంచి బయటకు వచ్చిన భార్గవి తిరిగిరాలేదు. కంగారుపడిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. ఎంత వెతికినా ఆమె ఆచూకీ తెలియకపోవడంతో చిక్కడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే సీసీ టీవీ దృశ్యాలను పరిశీలించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో భార్గవి నడుచుకుంటూ తిరుగుతున్నట్లుగా సీసీ కెమెరాల ఫుటేజీలో పోలీసులు గుర్తించారు. పలు ప్రాంతాల్లో ఆమె నడుచుకుంటూ వెళ్తున్న సీసీ టీవీ దృశ్యాలను గుర్తించారు.

అయితే పంజాగుట్ట నుంచి మలక్‌పేట వరకు వెళ్లింది. తన దగ్గర ఉన్న ఫోన్‌ను స్విచ్ ఆఫ్ చేసి ముసరాంబాగ్ వద్ద రోడ్డుపై పడేసినట్లుగా పోలీసులు గుర్తించారు. భార్గవికి ఏడాది క్రితమే వివాహమైంది. భార్గవి ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నారు కుటుంబసభ్యులు.

ఇవి కూడా చదవండి: Type 2 Diabetes: టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు పోస్ట్-కోవిడ్‌లో జాగ్రత్తగా ఉండండి..తాజా అధ్యయనంలో వెలుగు చూస్తున్న సమస్యలు..

Raja Chari: మహబూబ్‌నగర్‌ టు అంతరిక్షం వయా అమెరికా.. స్పేస్‌లో అడుగుపెట్టిన రాజాచారి..

Kashi Annapurna: 100 ఏళ్ల క్రితం చోరీ.. 4 ఏళ్ల కృషి.. కాశీకి చేరిన అమ్మ అన్నపూర్ణేశ్వరి దేవి..