Hyderabad: ప్రేమ పేరుతో కీచకుల వికృత చేష్టలు.. హైదరాబాద్‌లో భారీగా పోక్సో కేసులు

| Edited By: Narender Vaitla

Sep 12, 2024 | 2:14 PM

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజు బాలికలు మోసపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 71 పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. వీటిలో ప్రతిరోజు ఇలాంటి ఫిర్యాదులు లేదా ఈ తరహా కేసులు వస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి లేదా రెండు కేసులు నమోదవుతున్నాయి...

Hyderabad: ప్రేమ పేరుతో కీచకుల వికృత చేష్టలు.. హైదరాబాద్‌లో భారీగా పోక్సో కేసులు
Hyderabad
Follow us on

హైదరాబాదులో బాలికల పరిస్థితి బాధాకరంగా మారింది. పలు సందర్భాల్లో బాలికలపై తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపల స్పష్టంగా కనిపిస్తుంది. దీని తదనంతరం తన సందర్భాల్లో బాలికలు సైతం కొందరు పోకిరిల వలకు చిక్కుతున్నారు. హైదరాబాదులో నమోదు అవుతున్న పోక్సొ కేసులు భయాందోళన కలిగిస్తున్నాయి.. ఏడాది వ్యవధిలో చోటు చేసుకున్న కేసుల సంఖ్య కంటే ఏడాది ఎనిమిది నెలల్లో చోటు చేసుకున్న కేసుల సంఖ్య అధికంగా కావటమే ఇoదుకు కారణం.

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రతిరోజు బాలికలు మోసపోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 71 పోలీస్ స్టేషన్లో ఉన్నాయి. వీటిలో ప్రతిరోజు ఇలాంటి ఫిర్యాదులు లేదా ఈ తరహా కేసులు వస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు ఒకటి లేదా రెండు కేసులు నమోదవుతున్నాయి. బాలికలను వంచించి మోసం చేస్తున్న వారిపై ఫిర్యాదులు అందిన వెంటనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

2023లో ఇలాంటి మొత్తం 377 కేసులు నమోదుకాగా ఈఏడాది ఇప్పటి ఆగస్టు వరకు సుమారు 500 పోక్సో కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఏడాది మొత్తంలో నమోదైన కేసుల సంఖ్య 377. 2022లో నమోదైన కేసుల సంఖ్య 428 . ఇలా గతంతో పోలిస్తే ఏడాది ఎనిమిది నెలల వ్యవధిలోనే అత్యధిక కేసులు నమోదు కావటం విశేషం. మోసపోతున్న చిన్నారుల సంఖ్యలో అధికంగా 12 నుంచి 15 వయసుగల బాలికలు బాధితులుగా ఉంటున్నారు.

మరోవైపు బాలికలను ట్రాప్ చేసి మోసం చేస్తున్న నిందితుల సంఖ్య సగటున 25 నుంచి 35 వయసుగల యువకులు ఉంటున్నారు. ప్రతి ఏటా 400కు పైగా ఫోక్సో కేసులు నమోదు అవుతున్నాయి. వీరిలో అధిక శాతం బాలికలను మాయమాటలు చెప్పి మోసం చేసి మభ్య పెట్టే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. బాలికలు కూడా ఈజీగా వారి ట్రాప్ లో పడి వారి మాటలు నమ్మి వారితో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు ఆ తర్వాత మోసపోయామని గ్రహిస్తున్నారు.

దాదాపు 80 శాతానికి పైగా కేసుల్లో నిందితులు బాలికలను మాయ మాటలు చెప్పి మోసం చేస్తున్న వారే. మరోవైపు తల్లిదండ్రులకు సైతం పోలీసులు సూచనలు చేస్తున్నారు. తో పిల్లల పట్ల తల్లిదండ్రులు తప్పనిసరి శ్రద్ధ వహించాల్సిందే అని లేనిపక్షంలో ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటాయని పోలీసులు చెబుతున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..