BJP Vijay Sankalp Sabha: ‘శభాష్ సంజయ్’… బండి భుజం తట్టి ప్రశంసించిన ప్రధాని మోదీ

వర్షంలోనూ తగ్గేదే లే అంటూ బీజేపీ విజయ సంకల్ప సభకు భారీ ఎత్తున హాజరయ్యారు బీజేపీ కార్యకర్తలు. అంతమంది జనాల్ని చూసిన మోదీ ఆశ్చర్యానికి లోనయ్యారు.

BJP Vijay Sankalp Sabha: శభాష్ సంజయ్... బండి భుజం తట్టి ప్రశంసించిన ప్రధాని మోదీ
Modi Bandi Sanjay

Updated on: Jul 03, 2022 | 7:12 PM

Hyderabad” పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ఆసక్తికర ఇన్సిడెంట్ జరిగింది. సభావేదిక వద్దకు వచ్చి.. ప్రజలకు అభివాదం చేసిన అనంతరం కుర్చీలో కూర్చున్నారు ప్రధాని మోదీ. ఆయన పక్కనే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సైతం ఆసీనులయ్యారు. కాగా సభకు వచ్చిన జనాన్ని చూసి.. బండి సంజయ్ భుజం తట్టారు ప్రధాని. దీంతో లేచి నిల్చుని మోదీకి తిరిగి ధన్యవాదాలు తెలిపారు బండి సంజయ్.  వర్షంలోనూ ఇంతమంది జనం రావడంతో మోదీ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు.  అందుకే బండిని ప్రశంసించారు.

 

సభావేదికపై ప్రసంగించిన BJP రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌  ‘దేశ ప్రజల పాలిట దేవుడు.. ప్రధాని మోదీ’ అన్నారు. మోదీని ఎందుకు తిడుతున్నారో TRS నేతలు చెప్పాలని ఫైరయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే మోదీని కేసీఆర్‌ తిడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ‘తెలంగాణ అభివృద్ధికి TRS ప్రభుత్వం సహకరించడం లేదు. అందుకే BJP ప్రభుత్వం రావాలి. ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీజేపీ కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. కేంద్రంలో మరో 20 ఏళ్లపాటు బీజేపీ సర్కారు ఉంటుంది. ప్రధానిపై TRS నేతలు విమర్శలు చూస్తే బాధగా ఉంది’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.