PM Modi in Hyderabad Live: సికింద్రాబాద్‌లో మాదిగల విశ్వరూప సభ.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన

| Edited By: Ravi Kiran

Nov 11, 2023 | 7:37 PM

PM Narendra Modi in Telangana Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించి ఆ వర్గానికి దగ్గరైన బీజేపీ - తాజాగా తెలంగాణలో మరో కీలక సామాజికవర్గం ఎస్సీలకు చేరవయ్యే ప్రయత్నం చేపట్టింది. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి - MRPS నిర్వహిస్తున్న మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని పాల్గొననున్నారు.

PM Modi in Hyderabad Live: సికింద్రాబాద్‌లో మాదిగల విశ్వరూప సభ.. ప్రధాని మోదీ సంచలన ప్రకటన
Modi, Mandakrishna Madiga

PM Narendra Modi in Telangana Live Updates: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించి ఆ వర్గానికి దగ్గరైన బీజేపీ – తాజాగా తెలంగాణలో మరో కీలక సామాజికవర్గం ఎస్సీలకు చేరవయ్యే ప్రయత్నం చేపట్టింది. మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి – MRPS నిర్వహిస్తున్న మాదిగ విశ్వరూప మహాసభలో ప్రధాని పాల్గొననున్నారు. సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఈ సాయంత్రం జరిగే భారీ బహిరంగ సభకు MRPS విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎస్సీలకు గంపగుత్తాగా కాకుండా అందులోని కులాలను బట్టి రిజర్వేషన్లు కల్పించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏళ్లుగా డిమాండ్‌ చేస్తోంది. దళిత కులాల గణన ప్రత్యేకంగా చేపట్టాలని కోరుతోంది. MRPS అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గత నెల ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌ షాను కలిసి వర్గీకరణపై విజ్ఞాపన పత్రం అందజేశారు. దీనికి షా సానుకూలంగా స్పందించారనే మంద కృష్ణ వెల్లడించారు. ఈ క్రమంలో పరేడ్‌ గ్రౌండ్స్‌లో జరుగుతున్న సభలో ప్రధాని మోదీ వర్గీకరణపై స్పష్టమైన ప్రకటన చేస్తారని MRPS గట్టి నమ్మకంతో ఉంది.

 

మాదిగల విశ్వరూప మహా సభ లైవ్ వీడియో..

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Nov 2023 07:15 PM (IST)

    మోదీ సంచలన ప్రకటన

    ప్రధాని మోదీ సంచలన ప్రకటన చేశారు

    ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే కమిటీ వేస్తామని ప్రకటించారు

    న్యాయపరమైన ప్రక్రియ సుప్రీంకోర్టులో ఉందని, దానికి తాము మద్దతిస్తున్నామని పేర్కొన్నారు

    అంబేద్కర్ స్వప్నాన్ని తాము నెరవేర్చుతామని హామీ ఇచ్చారు

    మాదిగల ఉద్యమాన్ని గుర్తించానని, గౌరవిస్తున్నానని తెలిపారు

     

  • 11 Nov 2023 07:04 PM (IST)

    ప్రధాని మోదీ కీలక కామెంట్స్..

    తెలంగాణలో మీకు జరుగుతున్న అన్యాయం నన్ను కలిచివేసింది.

    మాదిగ బిడ్డ బంగారు లక్ష్మణ్ నేతృత్వంలో నేను పని చేశా

    ఓ కార్యకర్తగా అయన నుంచి ఎంతో నేర్చుకున్నా

    మాదిగ సమాజానికి నేను అండగా ఉంటా

    ఇన్నేళ్లు పోరాటాన్ని శాంతియుతంగా నడిపారు

  • 11 Nov 2023 07:01 PM (IST)

    ప్రధాని మోదీ కామెంట్స్..

    తెలంగాణలో ఇదొక చారిత్రాత్మిక ఘట్టం

    ఫ్రీ రేషన్ బియ్యాన్ని మరో ఐదేళ్ళు కొనసాగిస్తున్నాం

    పదేళ్ల క్రిందట అధికారంలోకి వచ్చిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక్కడి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చలేదు.

    బియ్యం కొనుగోళ్లలో ఎన్నికల కోడ్ అడ్డురాదు

    పంట కొనుగోలుకు బీఆర్ఎస్ సహకరించాలి

    కనీస మద్దతు ధర ద్వారా రైతులకు లాభం చేకూరుతుంది.

  • 11 Nov 2023 06:49 PM (IST)

    ప్రధాని మోదీ కామెంట్స్..

    ఢిల్లీలోని ఆప్‌తో కలిసి బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది.

    లిక్కర్ స్కాంలో రెండు పార్టీల ప్రమేయం ఉంది.

    బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒక్కటే

    ఒకరిపై ఒకరు పోటీ చేస్తున్నట్టు నటిస్తున్నారు

    కాంగ్రెస్, బీఆర్ఎస్ అంటేనే అవినీతికి నిదర్శనం

    కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండిటి టార్గెట్ బీజేపీనే

  • 11 Nov 2023 06:38 PM (IST)

    ప్రధాని మోదీ కామెంట్స్..

    ఆదివాసీ మహిళను బీజేపీ పార్టీ రాష్ట్రపతిని చేస్తే.. కాంగ్రెస్ అందుకు వ్యతిరేకించిందని ప్రధాని మోదీ అన్నారు. దళితుడు కోవింద్‌ను బీజేపీ రాష్ట్రపతిని చేసింది. కానీ ఆయన్ని ఓడించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది.

  • 11 Nov 2023 06:30 PM (IST)

    ప్రధాని మోదీ కామెంట్స్..

    దళిత బంధుతో మాదిగలకు న్యాయం జరగలేదు.

    రుణమాఫీ చేస్తానని సీఎం కేసీఆర్ రైతులను మోసం చేశారు

    తెలంగాణ అస్తిత్వాన్ని బీఆర్ఎస్ కాపాడలేకపోయింది

    అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ అన్ని విస్మరించింది

    కొత్త రాజ్యాంగంతో కేసీఆర్.. అంబేద్కర్‌ను అవమానించారు

    బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు దళిత విరోధులు.. ఆ రెండు పార్టీలతో జాగ్రత్తగా ఉండాలి.

  • 11 Nov 2023 06:24 PM (IST)

    ప్రధాని మోదీ కామెంట్స్..

    ఇకపై మీరు ఏదీ అడగాల్సిన అవసరం లేదు.

    పార్టీలు చేసిన పాపాలను ప్రాయశ్చిత్తం చేసేందుకు వచ్చాను.

    పార్టీలు చేసిన పాపాలకు నేను క్షమాపణలు చెబుతున్నా..

    దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని బీఆర్ఎస్ చెప్పి.. మోసం చేశారు..

    తెలంగాణ పోరాటంలో అన్ని వర్గాలు పాల్గొన్నాయి

  • 11 Nov 2023 06:19 PM (IST)

    ప్రధాని మోదీ కామెంట్స్..

    30 ఏళ్లుగా మందకృష్ణ మాదిగది ఒకటే లక్ష్యమన్న ప్రధాని మోదీ.. వన్ లైఫ్-వన్ మిషన్‌లా పోరాటం చేశారని కొనియాడారు. మాదిగల పోరాటానికి తన సంపూర్ణ మద్దతు ఉంటుందని మోదీ తెలిపారు.

  • 11 Nov 2023 06:17 PM (IST)

    ప్రధాని మోదీ కామెంట్స్..

    పండగ సమయంలో మనకు కావాల్సిన వాళ్ల మధ్య ఉంటే.. మన ఆనందం రెట్టింపు అవుతుందని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తమ ప్రభుత్వ తొలి లక్ష్యం పేదరిక నిర్మూలన అని ప్రధాని పేర్కొన్నారు. స్వాత్రంత్ర్యం వచ్చేక అనేక ప్రభుత్వాలు వచ్చాయని.. బీజేపీ మాత్రం అణగారిన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. సామాజిక న్యాయం అమలు చేసింది బీజేపీనే అని ప్రధాని మోదీ తెలిపారు

  • 11 Nov 2023 06:08 PM (IST)

    ఎస్సీ వర్గీకరణ చేయాలని మందకృష్ణ విజ్ఞప్తి..

    ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌ను పరిష్కరించాలని మందకృష్ణ మాదిగ.. ప్రధాని నరేంద్ర మోదీని విజ్ఞప్తి చేశారు. ఈ దేశ రిజర్వేషన్ ఫలితాలు, సంక్షేమ పధకాలు అందరికీ అందాలని అంబేద్కర్ చెప్పారు. దీన్ని నిజం చేసే బాధ్యత మీపై ఉంది. ఎస్సీ వర్గీకరణ జరిగితేనే అంత్యోదయ ఫలాలు అందుతాయి. మీరు చూసేందుకు గంభీరంగా కనిపించా మనసు వెన్నె లాంటిది. వర్గీకరణ చేస్తే మాదిగ జాతి అంతా మీకు అండగా ఉంటుంది అని తెలిపారు.

  • 11 Nov 2023 05:55 PM (IST)

    మోదీ దళిత వర్గాలకు అండగా నిలిచారు: మందకృష్ణ

    ప్రధాని మోదీ తనకు పెద్దన్న అని అన్నారు మందకృష్ణ మాదిగ. టీ అమ్ముకునే పెడ కుటుంబం నుంచి దేశాన్ని పాలించే గొప్ప నాయకుడిగా మోదీ ఎదిగారని కొనియాడారు. మీరు బలహీన వర్గాల నుంచి ఎదరు కాబట్టే తెలంగాణలో బీసీ బిడ్డను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పారని మోదీని ప్రశంసించారు మందకృష్ణ మాదిగ. మోదీ దళిత వర్గాలకు అండగా నిలిచారని.. కాబట్టే దళితులను రాష్ట్రపతి చేశారన్నారని ఆయన తెలిపారు. కాంగ్రెస్ రోజుల్లో ఇన్నీ పరిణామాలు జరగలేదని మందకృష్ణ మాదిగ విమర్శించారు.

  • 11 Nov 2023 05:51 PM (IST)

    పరేడ్‌ గ్రౌండ్స్‌ విశ్వరూప మహాసభలో ఆసక్తికర సన్నివేశాలు

    — పరేడ్‌ గ్రౌండ్స్‌ విశ్వరూప మహాసభలో ఆసక్తికర సన్నివేశాలు

    — కృష్ణ మాదిగ పిలుపుతో మోదీకి చేతులెత్తి నమస్కరించిన ఎమ్మార్పీఎస్ శ్రేణులు

    — తిరిగి వేదికపైనుంచి అందరికీ నమస్కరించిన మోదీ

    — మోదీని ఆలింగనం చేసుకుని మందకృష్ణ మాదిగ భావోద్వేగం

    — మంద కృష్ణను హత్తుకుని ఓదార్చిన మోదీ

  • 11 Nov 2023 05:41 PM (IST)

    మందకృష్ణ మాదిగ కన్నీరు.. ఓదార్చిన ప్రధాని మోడీ..

    విశ్వరూప మహాసభలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోదీ పక్కనే కూర్చుని మంద కృష్ణమాదిగ భావోద్వేగానికి లోనయ్యారు.  కన్నీరు పెట్టుకున్నారు. ప్రధాని మోడీ ఆయనను ఓదార్చారు.

  • 11 Nov 2023 05:41 PM (IST)

    సభకు హాజరైన ప్రధాని మోదీ..

    పరేడ్ గ్రౌండ్స్‌లో మాదిగల విశ్వరూప సభకు హాజరైన ప్రధాని మోదీ.. వేదికపై భావోద్వేగానికి గురైన మందకృష్ణ మాదిగ.. దీంతో ఆయన్ని ఓదార్చిన ప్రధాని మోదీ.

  • 11 Nov 2023 05:32 PM (IST)

    బేగం పేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న ప్రధాని

    ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి సికింద్రా బాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మాదిగల విశ్వరూప మహాసభకు హాజరవుతారు. అంతకు ముందు విమానాశ్రయంలో మోడీకి ఘన స్వాగతం లభించింది.

  • 11 Nov 2023 05:28 PM (IST)

    హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ..

    ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో టీబీజేపీ నేతలు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. కాసేపట్లో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరగబోయే మాదిగల విశ్వరూప మహాసభలో ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ.

  • 11 Nov 2023 04:24 PM (IST)

    20 నిమిషాలు ఆలస్యంగా..

    ప్రధాని మోడీ కాసేపట్లో హైదరాబాద్ కు చేరుకున్నారు. అయితే 20 నిమిషాలు ఆలస్యంగా 5.05 గంటలకు ప్రధాని మోడీ హైదరాబాద్ లో అడుగుపెట్టనున్నారు.

Follow us on