తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులుకదుపుతోన్న బీజేపీ వ్యూహాలకు పదునుపెడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రచారం స్పీడును పెంచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో మంగళవారం సాయంత్రం జరిగే బీజేపీ బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభలో పాల్గొంటారు. బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా ప్రధాని మోదీ తోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తుండడంతో టీబీజేపీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుని భారీ ఏర్పాట్లు చేసింది. బీజేపీ ఓబీసీ ఆత్మగౌర సభ నేపథ్యంలో ఎల్బీ స్టేడియం పూర్తిగా కాషాయమయం అయిపోయింది.
మరికాసేపట్లో ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారు. అనంతరం ఎల్బీ నగర్ స్టేడియానికి చేరుకుని ప్రసంగిస్తారు. ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది. అంతేకాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ప్రసంగించనున్నారు.
ఒక తరం భవిష్యత్తును బీఆర్‌ఎస్ సర్కార్ నాశనం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ధ్వజమెత్తారు. తెలంగాణలో వేల టీచర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని అన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామన్న మాట గాలిమూటగా మారిపోయిందని మోడీ ఆరోపించారు. రాష్ట్రాన్ని దోచుకోవాలన్నదే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల లక్ష్యమన్నారు. వారి పిల్లలకు దోచి పెట్టడమే వాళ్ల పని అంటూ విమర్శలు గుప్పించారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో అహంకారి సీఎంకు ఓటు శక్తి చూపించారని, ఇక్కడ నాయకులు మోదీని తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎల్బీస్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌవర సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలోనూ ఇక్కడ నేతలకు సంబంధం ఉందన్నారు. విచారణ ప్రారంభిస్తే దర్యాప్తు సంస్థలను తిడుతున్నారని మండిపడ్డారు. అవినీతి పనులపై కచ్చితంగా దర్యాప్తు జరుగుతుందన్నారు.
గ్రామాల్లో మహిళల గౌరవం కోసం కోట్లాది టాయిలెట్స్ కట్టించామని, వంటింటి పొగ నుంచి కోట్ల మంది మహిళలకు ఉపశమనం కల్పించామని మోడీ అన్నారు. కులవృత్తుల వారందరూ బీసీ వర్గానికి చెందిన వారేనని అన్నారు. కుల వృత్తుల వారి కోసం విశ్వకర్మ పథకం తీసుకువచ్చామని అన్నారు. మెడికల్, డెంటల్ కాలేజీల్లో బీసీలకు 27 శాతం రిజర్వేషన్ కల్పించామన్నారు.
గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసింది మేమేనని ప్రధాని మోడీ అన్నారు. బీసీ వ్యక్తిని ప్రధానిని చేసి నన్ను గౌరవించారని, ఇప్పుడు సీఎం కూడా బీసీ కాబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు మోడీ. పార్లమెంట్‌లో 85 మంది బీసీ ఎంపీలు ఉన్నారని గుర్తు చేశారు. జీఎంసీ బాలయోగిని స్పీకర్ చేసింది ఎన్‌డీఏ ప్రభుత్వమేనని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్.. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
తెలంగాణలో బీసీలను బీఆర్‌ఎస్ పట్టించుకోవడం లేదని ప్రధాని మోడీ అన్నారు. బీఆర్‌ఎస్‌కు తన కుటుంబమే ప్రాధాన్యత అని అన్నారు. ఈ స్టేడియం నుంచే బీసీ ప్రధాని అయ్యారు. ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం అవుతారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం బీసీలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంలో బీసీలను పట్టించుకునే బాధ్యత బీజేపీపై ఉందన్నారు.
ఇక్కడి నుంచే తెలంగాణకు బీసీ సీఎం రాబోతున్నారని ప్రధాని అన్నారు. తెలంగాణలో మార్పు తుఫాన్ కనిపిస్తోందని, మోదీని ప్రధానిని చేసే ఘట్టానికి పునాది పడింది ఇక్కడే అని అన్నారు. ఈ నేలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది-మోదీ
తెలంగాణలో ప్రభుత్వం మార్పు తుఫాను కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎల్బీస్టేడియంలో నిర్వహిస్తున్న బీసీ ఆత్మగౌరవ సభలో మోడీ ప్రసంగించారు. బీసీ ఆత్మగౌరవ సభలో పాలుపంచుకోవడం నా అదృష్టమని అన్నారు. తెలంగాణ బీసీల బాధ్యత ఇప్పుడు బీజేపీపై ఉందన్నారు. తెలంగాణలో ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ్యతిరేక సర్కార్ ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీసీలు కీలక పాత్ర పోషించారని గుర్తి చేశారు మోడీ.
సమ్మక్క. సారలమ్మకి జై… యాదాద్రి నర్సింహస్వామికి జై.. సభలకు వచ్చిన తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ తెలుగులో ప్రసంగించారు ప్రధాని నరేంద్ర మోడీ. కుటుంబ మధ్యన ఉన్నట్లు నాకు అనిపిస్తోందని మోడీ అన్నారు. నేతలతో నాకు విడదీయరాని అనుబంధం ఉంది అని అన్నారు.
ప్రతీ భారతీయుడి గుండెల్లో ప్రధాని నరేంద్ర మోడీ ధైర్యం నింపారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. సీఎంగా మోడీ అనుభవం దేశానికి ఎంతో మేలు చేసిందని పవన్ అన్నారు. కోట్లాది మంది కలలకు ప్రతి రూపం ప్రధాని మోడీ అని అన్నారు. మూడు దశాబ్దాల ప్రగతిని ఒక్క దశాబ్దంలోనే ప్రధాని సాధించారని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ వచ్చాక దేశంలో ఉగ్రదాడులు తగ్గిపోయాయని, మోడీ పాలనలో ఎన్నో ఉపయోగకరమైన ఎన్నో పథకాలు అందుబాటులోకి తీసుకువచ్చారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో జరుగుతున్న బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
హైదరాబాద్‌లో జరుగుతున్న బీసీ ఆత్మగౌరవ సభకు ప్రధాని నరేంద్ర మోడీతో పాటు జనసేవన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వల్ల దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రస్తావించారు.
తెలంగాణ దంగల్‌లో బీసీ కార్డ్‌తో దూసుకొస్తోంది బీజేపీ. కాసేపట్లో ప్రధాని మోదీ సభతో ఎన్నికల శంఖారావం పూరించబోతుంది కమల దళం.ఈ వేదికపై బీసీలకు వరాలు కురిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బీసీ సీఎం నినాదం ఎత్తుకున్న బీజేపీ.. ఈ సభతో బీసీలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ప్రధానితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు.
ఆత్మగౌరవ సభలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ హైదరాబాద్‌కు చేరుకుని ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రధాని మోడీ ఓపెన్ టాప్ జీపులో స్టేడియంకు చేరుకున్నారు. బీజేపీ శ్రేణులు పూలు చల్లుతూ మోడీకి ఘన స్వాగతం పలికారు. ఇప్పటికే సభ వేదికపైకి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఓపెన్ టాప్ లో ప్రధాని వెంట కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌లు ఉన్నారు.
హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో నిర్వహించే బీసీ గర్జన సభలకు ప్రధాన నరేంద్ర మోడీ హాజరయ్యారు. మోడీతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. వీరిద్దరు కూడా ఒకే వేదికపై కలుసుకోనున్నారు. అయితే ఈ సభలకు భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ఎల్బీ స్టేడియంకు వస్తున్న మోడీ.. ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు.
ప్రధాని నరేంద్ర మోడీ ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొంటారు. అయితే ఈ బీసీ గర్జన సభకు జనసేన నేత పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు.
కొద్దిసేపట్లో ప్రధాని నరేంద్రమోడీ ఎల్బీ స్టేడియంకు చేరుకోనున్నారు. బీజేపీ బీసీ ఆత్మగౌరవ బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా ప్రధాని మోదీ తోపాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటున్నారు.
ప్రధాన నరేంద్ర మోడీ బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. కొద్దిసేపట్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంకు చేరుకుంటారు.
తెలంగాణ దంగల్‌లో బీసీ కార్డ్‌తో దూసుకొస్తోంది బీజేపీ. కాసేపట్లో ప్రధాని మోదీ సభతో ఎన్నికల శంఖారావం పూరించబోతుంది కమల దళం. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవ సభకు హాజరుకానున్నారు మోదీ. ఈ వేదికపై బీసీలకు వరాలు కురిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బీసీ సీఎం నినాదం ఎత్తుకున్న బీజేపీ.. ఈ సభతో బీసీలను ఆకట్టుకోవాలని భావిస్తోంది. ప్రధానితో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ఈ సభలో పాల్గొంటారు. సభకు లక్ష మందిని తరలించే ఏర్పాట్లు చేశారు నేతలు.
బీజేపీ ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బీసీ ఆత్మగౌరవ సభలో పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు ప్రధాని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి చేరుకుని బహిరంగ సభకు హాజరవుతారు. సభ ముగిసిన తర్వాత తిరిగి ఢిల్లీ వెళ్లిపోతారు.