దగాపడిన తెలంగాణ యువతకు అండగా వచ్చా: పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూర్యాపేటలో బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేశారు. జనసేన పెట్టడానికి కారణం నల్గొండ జిల్లా అని చెప్పిన ఆయన నాడు ఫ్లోరోసిస్ సమస్య చూసి చలించిపోయానన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో సామాన్యులకు న్యాయం జరగడం లేదన్నారు.

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూర్యాపేటలో బీజేపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావుకు మద్దతుగా ప్రచారం చేశారు. జనసేన పెట్టడానికి కారణం నల్గొండ జిల్లా అని చెప్పిన ఆయన నాడు ఫ్లోరోసిస్ సమస్య చూసి చలించిపోయానన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పడిన తెలంగాణలో సామాన్యులకు న్యాయం జరగడం లేదన్నారు. దగాపడిన తెలంగాణ యువతకు అండగా నిలబడేందుకే వచ్చానని చెప్పారు పవన్. అలాగే కొత్తగూడెంలో ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్.. పేపర్ లీకేజీ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్స్ వల్ల ఎంతోమంది నిరుద్యోగులు నష్టపోయారన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మాత్రమే భూముల ధరలు పెరిగాయని.. జిల్లాల్లో ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉందన్నారు పవన్. కేసీఆర్, రేవంత్ రెడ్డితో తనకు పరిచయాలున్నాయన్న పవన్.. స్నేహం వేరు రాజకీయం వేరని క్లారిటీ ఇచ్చారు. గత పాలకులు చేసిన తప్పే తిరిగి తెలంగాణలో పునరావృతం అవుతోందన్నారు పవన్ కళ్యాణ్.
