Summer Trains: ప్రత్యేక రైళ్లలో ఏసీ బోగీల కొరత.. రెట్టింపు ఛార్జీలతో బాదుడు

|

Apr 17, 2022 | 11:07 AM

వేసవి ప్రారంభమైంది. స్కూళ్లకు సెలవులు ఇచ్చే సమయం ఆసన్నమవుతుండటంతో ప్రయాణాలు చేసేవారు ముందే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో రద్దీ ఏర్పడుతోంది. ఈ విషయాన్ని గమనించిన దక్షిణ మధ్య....

Summer Trains: ప్రత్యేక రైళ్లలో ఏసీ బోగీల కొరత.. రెట్టింపు ఛార్జీలతో బాదుడు
Ac Trains
Follow us on

వేసవి ప్రారంభమైంది. స్కూళ్లకు సెలవులు ఇచ్చే సమయం ఆసన్నమవుతుండటంతో ప్రయాణాలు చేసేవారు ముందే టిక్కెట్లు రిజర్వేషన్ చేసుకుంటున్నారు. దీంతో రైళ్లలో రద్దీ ఏర్పడుతోంది. ఈ విషయాన్ని గమనించిన దక్షిణ మధ్య రైల్వే(SCR) రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తోంది. అయితే.. దూర ప్రయాణాలు చేసేవారు ఏసీ బోగీల్లో(AC Compartments) వెళ్లేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రెగ్యులర్‌ రైళ్లలో ఏసీ బోగీలు తక్కువగా ఉండటంతో ప్రీమియం రైళ్లకు(Premium Trains) డిమాండ్‌ ఏర్పుడుతోంది. రాజధాని, దురంతో, శతాబ్ది, హమ్‌సఫర్‌ వంటి ఏసీ రైళ్లలో టికెట్‌ ఛార్జీలు రెగ్యులర్‌ బండ్లతో పోలిస్తే దాదాపు రెండింతలుగా ఉంటున్నాయి. కొన్ని సందర్భాల్లో ఆ ఛార్జీలు విమాన ఛార్జీలను సైతం మించిపోవడం గమనార్హం. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి ఢిల్లీకి 2 నుంచి 3 వారాల ముందు బుక్‌ చేసుకుంటే విమాన టికెట్‌ రూ.4,200 నుంచి రూ.5 వేలకు దొరుకుతుంది. అదే రాజధాని, దురంతో రైళ్లలో ఫస్ట్‌ ఏసీ టికెట్‌కు రూ.5,865 పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

తిరుపతికి ప్రత్యేక రైళ్లు..

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంటూరు మీదుగా తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే మండల అధికారులు తెలిపారు. ఈ రైలు(08581) ప్రతి ఆదివారం విశాఖపట్నంలో 23.00 గంటలకు బయలుదేరి విజయవాడ 04.50, న్యూ గుంటూరు 05.38, తిరుపతి 12.20 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు(08582) ప్రతి సోమవారం 21.55 గంటలకు బయలుదేరి న్యూగుంటూరు 03.23, విశాఖపట్నం 11.00 గంటలకు చేరుతుంది. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Also Read

Post Office: పోస్టాఫీసు ఖాతాదారులు అలర్ట్‌.. ఇంటర్‌నెట్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ని ఇలా యాక్టివేట్ చేసుకోండి..!

Andhra Pradesh: ఏపీ సర్కారు కొత్త ఆదేశాలు.. ఇకపై ఆ ఉద్యోగులు రోజుకు మూడుసార్లు హాజరు వేయాల్సిందే..

Inter Exams: ఇంటర్ విద్యార్థులకు గమనిక.. ఇబ్బందులు తలెత్తకుండా అధికారుల కీలక నిర్ణయం