హైదరాబాద్ కార్ ఆక్సిడెంట్: మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం!

| Edited By: Srinu

Nov 25, 2019 | 2:02 PM

హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభించిన గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో  మహిళ మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కొట్టి కింద పడింది. ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. కారు అతి వేగంతో తమను దాటుకుంటూ వెళ్లిందని, దాని వేగానికి తమకు షివరింగ్ వచ్చిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమయంలో […]

హైదరాబాద్ కార్ ఆక్సిడెంట్: మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణం!
Follow us on

హైదరాబాద్ లో నూతనంగా ప్రారంభించిన గచ్చిబౌలి బయో డైవర్సిటీ ఫ్లైఓవర్‌పై శనివారం ఘోర ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో  మహిళ మృతి చెందగా మరో 9 మంది గాయపడ్డారు. ఓ కారు అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కొట్టి కింద పడింది.

ఓవర్ స్పీడ్ ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. కారు అతి వేగంతో తమను దాటుకుంటూ వెళ్లిందని, దాని వేగానికి తమకు షివరింగ్ వచ్చిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. ప్రమాద సమయంలో కారు 104 కి.మీ.వేగంతో ఉందని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఈ ఫ్లైఓవర్ పై రెండు వరుస ప్రమాదాలు జరిగాయి. ఇద్దరు యువకులు సెల్ఫీ తీసుకుంటుండగా ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఫ్లైఓవర్ పై ప్రమాదకరమైన టర్నింగ్ ఉంది, వాహనదారులు ఇది గమనించకుండా అతి వేగంతో ప్రయాణించడమే ప్రమాదాలకు కారణమని పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు. నవంబర్ 10 న, కాగ్నిజెంట్ కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఇక్కడే దుర్మరణం పాలయ్యాడు.

990 మీటర్ల పొడవైన ఈ వన్-వే ఫ్లైఓవర్ దివ్యశ్రీ ఓరియన్ సెజ్ వద్ద ప్రారంభమై జీవ వైవిధ్య జంక్షన్ తరువాత ముగుస్తుంది. ఈ వంతెన రూ .69.47 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. ప్రమాదం జరిగిన తరువాత ఈ ఫ్లైఓవర్‌ పై పాదచారులను, సెల్ఫీలకోసం ఎవరినీ అనుమతించమని, గరిష్ట వేగ పరిమితి 40 కిలోమీటర్లకు పరిమితమని. నేటి నుంచి మూడు రోజుల పాటు ఫ్లైఓవర్‌ను మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు.