తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూలై 1 నుంచి ఎల్‌కేజీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఆన్‌లైన్ తరగతులు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. దేశంలో ఏ రాష్ట్రం సాధించని విధంగా కరోనా కాలంలో తెలంగాణ విద్యావ్యవస్థ పని చేసిందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. టీ-శాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్ధులు ఆన్‌లైన్ తరగతులను వీక్షించవచ్చునని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది కూడా విద్యాసంస్థలు కేవలం ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని.. 30 శాతం ఫీజులు తగ్గించుకోవాలన్నారు. 50 శాతం టీచర్లు స్కూళ్లకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అటు ఒకటి, రెండు తరగతి పిల్లలకు ఆగష్టు 1 నుంచి క్లాసులు ప్రారంభం అవుతాయని వెల్లడించారు. కాగా, గత ఏడాదిలానే 46జీవో అమలవుతుందని.. జూలైలో జరగాల్సిన పరీక్షలు, సెట్స్ ఎగ్జామ్స్ యధాతధంగా జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. (Telangana Online Classes)
1) 2020-21 విద్యా సంవత్సరంలో ట్యూషన్ ఫీ మాత్రమే వసూలు చేయాలి.
2) గత సంవత్సరం ఎంత ట్యూషన్ ఫీ ఉందో అదే వసూలు చేయాలి. ఎలాంటి రుసుములను పెంచకూడదు
3) అది కూడా నెల వారిగా మాత్రమే తీసుకోవాలి.
4. పై సూచనలను ఉల్లంఘిస్తే పాఠశాల గుర్తింపు రద్దు అవుతుంది, నిబంధనల ప్రకారం పాఠశాల నిర్వహణపై తగిన చర్యలను ప్రారంభిస్తుంది.
5. పాఠశాల విద్య కమిషనర్, తెలంగాణ, ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది
Also Read: ఈ ఫోటోలో మరో చిరుత దాగుంది.. కనిపెట్టగలరా! గుర్తు పట్టలేదా.? అయితే ఈ క్లూ ట్రై చేయండి..