MEIL: రోడ్డెక్కనున్న మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు.. ఒలెక్ట్రాతో TSRTC రూ.500 కోట్ల ఒప్పందం..

| Edited By: Ravi Kiran

Jul 22, 2022 | 7:54 PM

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ బస్సులు సందడి మొదలుకాబోతోంది. ఈమేరకు 300 బస్సులు టీఎస్ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. వీటికోసం రూ. 500 కోట్లను చెల్లించనుంది.

MEIL: రోడ్డెక్కనున్న మరో 300 ఎలక్ట్రిక్ బస్సులు.. ఒలెక్ట్రాతో TSRTC రూ.500 కోట్ల ఒప్పందం..
Olectra Tsrtc
Follow us on

OLECTRA – TSRTC: హైదరాబాద్‌ రోడ్లపై ఎలక్ట్రిక్‌ బస్సులు నడిపేందుకు టీఎస్ఆర్టీసీ సిద్ధమైంది. ఈమేరకు Olectra Greentech Limited (OLECTRA) నుంచి 300 ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసేందుకు ఒప్పంద చేసుకుంది. వీటి కోసం దాదాపు రూ.500 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. ఈమేరకు MEIL గ్రూప్ కంపెనీ ETEY(Evey Trans Private Limited), TSRTCల నుంచి లెటర్ ఆఫ్ అవార్డ్ (LoA)ని అందుకుంది. ఈ మేరకు Olectra Greentech Limited (OLECTRA) ఆర్టీసీ నుంచి ఆర్డర్ ను పొందింది. సెంట్రల్ గవర్నమెంట్ ప్రకటించిన ఫేమ్ – 2 పథకం కింద టీఎస్ఆర్టీసీ 300 ఎలక్ట్రిక్ బస్సులను కోనుగోలు చేయనుంది. 12 ఏళ్లకుగానూ గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఎలక్ట్రిక్ బస్సులను కొనగోలు చేయనుంది. ఒలెక్ట్రా ఈ బస్సులను వచ్చే 20 నెలల్లో టీఎస్ఆర్టీసీకి అప్పగించాల్సి ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణకు కూడా ఒలెక్ట్రా చూసుకుంటుంది.

ఈ సందర్భంగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కేవీ ప్రదీప్ మాట్లాడుతూ, “మరో ప్రతిష్టాత్మకమైన ఆర్డర్‌ను దక్కించుకోవడం సంతోషంగా ఉంది. మా అత్యాధునిక జీరో-ఎమిషన్ బస్సులతో తెలంగాణ ప్రజలకు సేవలందిస్తున్నందుకు గర్విస్తున్నాం. మా బస్సులు ఇప్పటికే గత మూడు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో సేవలు అందిస్తున్నాయి. ప్రయాణికులను విమానాశ్రయానికి విజయవంతంగా సేవలు అందిస్తున్నాయి. మేం షెడ్యూల్ ప్రకారం బస్సులను అందజేస్తాం. ఉత్తమ ప్రయాణ అనుభవాన్ని అందిస్తాం” అంటూ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ బస్సులు 12-మీటర్లు, లో ఫ్లోర్, నాన్-ఏసీ బస్సులు 35+డి సీటింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. ఎలక్ట్రానిక్ కంట్రోల్డ్ ఎయిర్ సస్పెన్షన్‌తో సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నాయి. ఈ బస్సుల్లో ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు, ప్రతి సీటుకు యూఎస్‌బీ సాకెట్లు, ఎమర్జెన్సీ బటన్‌లు ఉంటాయి. బస్సులో అమర్చిన లిథియం-అయాన్ (Li-ion) బ్యాటరీ ట్రాఫిక్, ప్రయాణీకుల లోడ్ పరిస్థితుల ఆధారంగా ఒక ఛార్జ్‌తో 180 కిలోమీటర్లు ప్రయాణించేలా చేస్తుంది.