Hyderabad: సిటీలో నొరో వైరస్ టెర్రర్.. లక్షణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి

| Edited By: Ram Naramaneni

Jul 28, 2024 | 11:40 AM

హైదరాబాద్ నగరంలో మరో వైరస్ జడలు విప్పింది. నోరో వైరస్‌పై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ పౌరులను అలెర్ట్ చేసింది. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేసింది.

Hyderabad: సిటీలో నొరో వైరస్ టెర్రర్.. లక్షణాలు ఇవే.. ఈ జాగ్రత్తలు పాటించండి
Norovirus
Follow us on

జనాల్ని రోజుల వ్యవధిలో బలి తీసుకున్న కరోనా కల్లోల్లాన్ని ఇంకా మరవనే లేదు. ఈ లోపే రకరకాల వైరస్‌లు.. జనాల్ని ఎటాక్ చేస్తున్నాయి. తాజాగా నొరో వైరస్ జనాల్ని భయబ్రాంతుల్ని చేస్తోంది. ఈ మహమ్మారి వైరస్.. భాగ్యనగరంలోకి ఎంట్రీ ఇవ్వడమే కాదు.. ఆల్రెడీ.. రోజుకు 100 నుంచి 120 కేసులు నమోదవుతున్నట్లు GHMC వెల్లడించింది. ఈ క్రమంలో పౌరులు.. అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అసలే వానకాలం కావడంతో.. కలుషిత నీరు, దోమల కారణంగా… డెంగీతో పాటు మలేరియా, టైఫాయిడ్, డయేరియా వంటి వ్యాధులతో నగర వాసులు సతమతమవుతున్నారు. తాజాగా నొరో వైరస్ అందరినీ టెన్షన్ పెడుతోంది. దీన్ని వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటారు. నాణ్యతలేని ఆహారం, కలుషిత నీరే.. నొరో వైరస్ వ్యాప్తికి కారణమని వైద్యులు చెబుతున్నారు. వాంతులు, విరేచనాలు, చలి జ్వరం, విపరీతమైన నీరసం, డీహైడ్రేషన్, కడుపు నొప్పి వంటివి ఈ వ్యాధి లక్షణాలు. వైరస్ సోకిన వ్యక్తిలో 48 గంటల్లోనే సింటమ్స్ కనిపిస్తాయి. ఇది అంటువ్యాధి.. అందుకే అప్రమత్తత అవసరం. షుగర్ ఉన్నవారు త్వరగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. నొరో వైరస్‌ కట్టడి ప్రస్తుతానికి ఎలాంటి మెడిసిన్ లేదు. డాక్టర్లు ఇచ్చిన మెడిసిన్‌తో.. సూచించిన జాగ్రత్తలు పాటిస్తే రెండు రోజుల్లో రికవరీ అవ్వొచ్చు. నొరో వ్యాప్తి నేపథ్యంలో GHMC చేసిన సూచనలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

– కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలి
– చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి
– ఇంటిని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..