రేణుకా చౌదరికి స్వల్ప ఊరట.. వారెంట్ ఎత్తివేత

| Edited By:

Sep 24, 2019 | 11:53 AM

కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరికి ఓ కేసులో ఊరట లభించింది. ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి గత నెలలో జారీ అయిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను ఖమ్మం రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఎత్తివేసింది. ఈ కేసుకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో గత నెల 29న ఖమ్మం కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రేణుకాచౌదరి ఖమ్మం రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరయ్యారు. కేసు వివరాలు […]

రేణుకా చౌదరికి స్వల్ప ఊరట.. వారెంట్ ఎత్తివేత
Follow us on

కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరికి ఓ కేసులో ఊరట లభించింది. ఒక ప్రైవేట్ కేసుకు సంబంధించి గత నెలలో జారీ అయిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను ఖమ్మం రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఎత్తివేసింది. ఈ కేసుకు సంబంధించి స్పష్టమైన సమాచారం అందకపోవడంతో గత నెల 29న ఖమ్మం కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం రేణుకాచౌదరి ఖమ్మం రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో హాజరయ్యారు. కేసు వివరాలు పరిశీలించిన అనంతరం రేణుకా చౌదరిపై జారీ చేసిన నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ను జడ్జి ఎత్తివేస్తూ రీకాల్‌ చేశారు. ఇక తదుపరి విచారణ వచ్చే నెల 17కు వాయిదా పడింది.

కాగా కాంగ్రెస్ పార్టీ నుంచి చట్టసభలకు పోటీ చేసేందుకు రాంజీనాయక్‌కు టికెట్ ఇప్పిస్తానని వంచించారు కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకాచౌదరీ. ఎలాగూ టికెట్ వస్తోందనే ధీమాతో రేణుకా అడిగిన రూ.కోటి 40 లక్షల నగదును కూడా అందజేశాడు రాంజీనాయక్. కానీ టికెట్ మాత్రం రాలేదు. దీంతో అతను తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన చనిపోయారు. తర్వాత అతని భార్య ప్రభావతి మీడియా ముందుకొచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. ఆ తరువాత టికెట్ పేరుతో తమను రేణుకాచౌదరి మోసం చేశారని ఖమ్మం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ప్రభావతి. టికెట్ రాలేదని మనస్థాపంతోనే తన భర్త చనిపోయాడని ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విచారణ చేపట్టిన కోర్టు .. విచారణకు రావాలని రేణుకాచౌదరికి ఆదేశాలు జారీచేసింది. కానీ ఆమె విచారణకు హాజరుకాకపోగా.. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సరికాదని తీరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. దీంతో దిగొచ్చిన రేణుకా.. సోమవారం కోర్టుకు హాజరయ్యారు.