కేఏ పాల్‌పై మర్డర్ కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ!

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో తొమ్మిదవ నిందితుడిగా ఉన్న పాల్‌పై మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా మిగిలిన నిందితులతో పాటు కేఏ పాల్ హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, కేఏ పాల్ తమ్ముడు డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. […]

కేఏ పాల్‌పై మర్డర్ కేసు.. అరెస్ట్ వారెంట్ జారీ!

Updated on: Aug 19, 2019 | 3:49 PM

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్‌పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. సోదరుడు డేవిడ్ రాజు హత్య కేసులో తొమ్మిదవ నిందితుడిగా ఉన్న పాల్‌పై మహబూబ్‌నగర్ జిల్లా కోర్టు వారెంట్ ఇష్యూ చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా మిగిలిన నిందితులతో పాటు కేఏ పాల్ హాజరు కాకపోవడంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. కాగా, కేఏ పాల్ తమ్ముడు డేవిడ్ రాజు 2010 ఫిబ్రవరిలో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొమ్మిరెడ్డిపల్లి వద్ద రోడ్డుపై ఆగిఉన్న కారులో డేవిడ్ రాజు మృతదేహం లభ్యమైంది. కారు ముందు సీట్లో డేవిడ్ రాజు శవం పడి ఉంది.