Hyderabad water supply : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో గురు, శుక్రవారాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మంజీరా వాటర్ సప్లై ఫేజ్- II, 1500 ఎంఎం డయా పిఎస్సి పైప్‌లైన్‌ను మార్చడానికి జంక్షన్ పనులను చేపట్టడం, పటాన్ చెరు నుండి హైదర్‌నగర్ వరకు గల పంపింగ్ మెయిన్ పనుల కోసం సన్నాహాలు పూర్తయ్యాయి. ఎంఎస్ పైప్ లైన్ మదీనాగూడ వద్ద వరద నీటి కాలువ, ఇంకా, ఇతర లీకేజీ పనుల నిర్మాణ పనులు కూడా చేపట్టబోతున్నారు. దీని కారణంగా తేదీ: 27.05.2021, గురువారం ఉదయం 6 గంటల నుండి తేదీ: 28.5.2021, శుక్రవారం సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 36 గంటల పాటు వివిధ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. కావున క్రింద పేర్కొన్న ప్రాంతాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
నగరంలో మంచినీటి సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:
1. ఓ అండ్ ఎం డివిజన్ నెం. 15 – గంగారాం, దీప్తీశ్రీ నగర్, కెఎస్ఆర్ ఎన్ క్లేవ్, అపర్ణ హిల్స్, ఆదర్శ్ నగర్, శాంతి నగర్, మియాపూర్, మైత్రినగర్, మదీనాగూడ, ఉషోదయ నగర్, వైశాలి నగర్, రామకృష్ణ నగర్, సాయిరాం కాలనీ, మియాపూర్ క్రాస్ రోడ్స్, మాతృ శ్రీ నగర్, రాజారాం కాలనీ, అంబేద్కర్ నగర్, జనప్రియ ఫేజ్ 1 & 2, మియాపూర్ విలేజ్, మాధవ్ నగర్, భాను టౌన్ షిప్, నంది కోఆపరేటివ్ సొసైటీ, హుడా మయూరి నగర్, ఎస్సీ బోస్ నగర్, సిర్లా గార్డెన్స్, ఆర్బిఆర్ బాలాజీ నగర్, ఆదిత్య నగర్, శ్రీరంగపురం.
2. ఓ అండ్ ఎం డివిజన్ నం 9 – హైదర్ నగర్, అడ్డగుట్ట,నిజాంపేట్ మెయిన్ రోడ్, కెపిహెచ్‌బి కాలనీలోని వసంత్ నగర్, రామ్ నరేష్ నగర్.
3. ఓ అండ్ ఎం డివిజన్ నం 32 – బొల్లారం మున్సిపాలిటీ, ఐలాపుర్ గ్రామం, గండి గూడెం, సుల్తాన్‌పూర్, కిష్టారెడ్డి పేట్, పటేల్ గూడ గ్రామం.
4. ఓ అండ్ ఎం డివిజన్ నం 6 పరిధిలో ఎస్.అర్. నగర్, ఎర్రగడ్డ ప్రాంతాల్లో మాత్రం లో ప్రెజర్ నీరు వస్తుంది. కావున నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని హైదరాబాద్ మెట్రోపాలిటన్ నీటి సరఫరా, మురుగునీటి బోర్డు అధికారులు కోరడమైనది.
Read also : TS Cabinet : 30న టీఎస్ క్యాబినెట్ భేటీ.. ఆ కీలక అంశాలపై చర్చించనున్న మంత్రివర్గం