NMDC Workmen Recruitment 2022: ఐటీఐ డిప్లొమా అభ్యర్ధులకు అలర్ట్‌! రూ.35 వేల జీతంతో 200 ఉద్యోగావకాశాలు..పూర్తి వివరాలివే!

|

Feb 07, 2022 | 6:32 PM

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌గా ఉన్న నేషనల్‌ మినరల్‌ డెవలస్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NMDC) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది...

NMDC Workmen Recruitment 2022: ఐటీఐ డిప్లొమా అభ్యర్ధులకు అలర్ట్‌! రూ.35 వేల జీతంతో 200 ఉద్యోగావకాశాలు..పూర్తి వివరాలివే!
Nmdc Workmen
Follow us on

Workmen/Trainee jobs: భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌ హెడ్‌ ఆఫీస్‌గా ఉన్న నేషనల్‌ మినరల్‌ డెవలస్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (NMDC) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

ఖాళీల సంఖ్య: 200

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

  • ట్రైనీ ఫీల్డ్‌ అటెండెంట్: 43
  • మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌ (మెకానికల్‌ ట్రైనీ): 90
  • మెయింటెనెన్స్‌ అసిస్టెంట్‌ (ఎలక్ట్రికల్‌ ట్రైనీ): 35
  • ఎంసీఓ గ్రేడ్‌ 3 (ట్రైనీ): 4
  • హెమ్‌ మెకానిక్‌ గ్రేడ్‌ 3 (ట్రైనీ): 10
  • ఎలక్ట్రీషియన్‌ గ్రేడ్‌ 3 (ట్రైనీ): 7
  • బ్లాస్టర్‌ గ్రేడ్‌ 2 (ట్రైనీ): 2
  • క్యూసీఏ గ్రేడ్‌ 3 (ట్రైనీ): 9

పే స్కేల్‌: నెలకు రూ.18,100ల నుంచి రూ.35,040ల వరకు చెల్లిస్తారు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ, ఇంజనీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు మార్చి 2, 2022 నాటికి 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌, ఫిజికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు ప్రారంభతేదీ: ఫిబ్రవరి 10, 20222.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

ESIC PGIMSR Recruitment 2022: ఎటువంటి రాతపరీక్ష లేకుండానే.. ఈఎస్‌ఐఎల్‌లో 95 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌!