
హైదరాబాద్‌లో అరుదైన సంఘటన వెలుగుచూసింది. కేబీఆర్ పార్క్‌లో నిజాం కాలం నాటి పెట్రోల్ పంపు బయటపడింది. పార్క్‌లో వాకింగ్‌కు వచ్చిన ఓ వ్యక్తి దీన్ని గుర్తించారు. అతను పెట్రోల్ బంక్‌కు సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. ఇన్నాళ్లూ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఈ పెట్రోల్ పంపు ఎండాకాలం రావడంతో పచ్చదనం తగ్గి బయటపడింది. నిజాం తన కార్లు, మోటారు యంత్రాలు, ఇతర వాహనాలలో ఇంధనం నింపేందుకు దీన్ని వినియోగించినట్లు చెబుతున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించడంతో కేబీఆర్ పార్క్‌కు వచ్చేవాళ్లు పెట్రోల్ పంపును చూడటానికి ఇంట్రస్ట్ చూపుతున్నారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్.. హైదరాబాద్ స్వదేశీ సంస్థానాన్ని పాలించిన చివరి నవాబు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరుపొందారు.
హైదరాబాద్‌లోని KBR నేషనల్ పార్క్ 142.5 హెక్టార్ల వైశాల్యంలో ఉంటుంది. గతంలో దీన్ని గతంలో జూబ్లీ హిల్స్ ఫారెస్ట్ బ్లాక్ అని పిలిచేవారు. గతంలో హైదరాబాద్ నిజాం ఆధీనంలో ఉన్న ఈ పార్కును అర్బన్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. అయితే 2.4 హెక్టార్ల భూమిని మాత్రం నిజాం కుటుంబీకులు ఆధీనంలోనే ఉంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
#Hyderabad#Facebook user #RajusAlluri had shared info about a personal petrol pump/filling station of #Nizam of #Hyderabad for his fleet of cars, trucks & other machinery in #KBRPark, unnoticed & hidden in thick foliage!#ChiranFortPalace@syedurahman @HiHyderabad @stoppression pic.twitter.com/wyGYhWRUI0
— Muzzammil KhanⓂ️ مزمل خان (@MohdMuzzammilK) February 23, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..