Hyderabad: పాపిష్టి పార్టీ ప్రాణాలు తీసింది.. ఫుల్లుగా మద్యం తాగి బిర్యానీ తిన్నారు.. కట్ చేస్తే ఇలా

మద్యం తాగి బిర్యానీ తిన్న పాండు అనే 53 ఏళ్ల వ్యక్తి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. 15 మందిలో ఒక్కరు చనిపోగా మిగతా వాళ్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ మందిని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఒకరికి ICUలో చికిత్స అందిస్తున్నారు..

Hyderabad: పాపిష్టి పార్టీ ప్రాణాలు తీసింది.. ఫుల్లుగా మద్యం తాగి బిర్యానీ తిన్నారు.. కట్ చేస్తే ఇలా
New Year Party Death

Updated on: Jan 01, 2026 | 1:35 PM

హైదరాబాద్‌, జనవరి 1 2026: నూతన సంవత్సర వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది.. బిర్యానీ ఒకరి ప్రాణం తీసింది. ఈ విషాద ఘటన కూకట్‌పల్లి సమీపంలోని జగద్గిరిగుట్ట భవానీనగర్‌లో జరిగింది. న్యూ ఇయర్‌ సందర్భంగా తెలిసినవాళ్లంతా కలిసి నిన్న రాత్రి ఒక చోట చేరి పార్టీ చేసుకున్నారు. అయితే.. భవానీనగర్‌లోని కమ్యూనిటీ హాల్ దగ్గర అంతా కలిసి బిర్యానీ వండుకున్నారు.. మద్యం తాగి బిర్యానీ తిని ఎంజాయ్‌ చేశారు. తీరా ఇంటికి వెళ్లాక ఒక్కొక్కరూ అస్వస్థతకు గురయ్యారు.

మద్యం తాగి బిర్యానీ తిన్న పాండు అనే 53 ఏళ్ల వ్యక్తి ఇంట్లోనే ప్రాణాలు కోల్పోయారు. 17 మందిలో ఒక్కరు చనిపోగా మిగతా వాళ్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఎక్కువ మందిని మల్లారెడ్డి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఒకరికి ICUలో చికిత్స అందిస్తున్నారు.. మిగతా వాళ్లు కోలుకుంటున్నారని వైద్యులు చెప్తున్నారు. అయితే.. వీరంతా స్వయంగా వండుకుని బిర్యానీ తిన్నారని.. మద్యంతో పార్టీ చేసుకున్నారని స్థానికులు తెలిపారు.

ప్రాథమికంగా ఫుడ్‌ పాయిజన్ వల్లే ఇలా జరిగినట్టు పోలీసులు నిర్థారించుకున్నారు. కూరలు వండేప్పుడు అందులో వేసిన మసాలాలు, కారం లాంటివి ఎక్స్‌పైర్ అయిన ప్యాకెట్లు అయ్యుంటాయని అందుకే ఇలా జరిగి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..

కొంచమే తాగా.. మీ మిషనే తప్పు చూపిస్తోంది సార్.. లబలబ ఏడ్చిన మందుబాబు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..