నార్సింగి రోడ్డు యాక్సిడెంట్ కొత్త మలుపు తిరిగింది. హీరో రాజ్‌తరుణ్ మద్యం తాగి మత్తులో అతివేగంతో కారు నడిపి నట్టు తెలుస్తోంది. ఓఆర్ఆర్‌పై జరిగిన ఈ ర్యాష్ డ్రైవింగ్‌లో కారు రోడ్డు గార్డెన్ ఫెన్సింగ్‌ను ఢీకొట్టి పక్కకి పడిపోయినట్టు సమాచారం. ఈ ప్రమాదంతో.. వోల్వ్స్ కారును వదిలి రాజ్ తరుణ్ పారిపోయినట్టు తెలిసింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. మద్యం మత్తులో ఉన్న రాజ్ తరుణ్ బహుశా కారు నడిపినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాహనం వదిలిపెట్టి పారిపోవడంతో.. అనుమానాలు పెరిగిపోతున్నాయి.