హైదరాబాద్ కూకటపల్లిలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బస్సుపై భాగంలో ఏసీ వద్ద మంటలు రావడంతో కొందరు ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. విషయాన్ని బస్సు డ్రైవర్‌కు తెలియజేయడంతో.. వెంటనే బస్సును నిలిపివేశాడు. వెంటనే అందులో ఉన్న ప్రయాణికులు కిందకు దిగేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని.. మంటలను అదుపుచేశారు. మియాపూర్ నుంచి తిరుపతి బయల్దేరిన మేఘన ట్రావెల్స్ బస్సు 60 మంది ప్రయాణికులతో బయల్దేరింది. కూకట్‌పల్లి బస్సు డిపో వద్దకు రాగానే మంటలు చెలరేగాయి. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.