Hyderabad: నగరంలోని ఈ 4 ప్రాంతాల్లో బుధవారం మాక్ డ్రిల్..

యుద్ధం వేళల్లో ప్రజలు ఎలా స్పందించాలనే విషయంపై సన్నద్ధత కోసం దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మే 7, బుధవారం మాక్ డ్రిల్స్‌ను చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి తరువాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో మాక్ డ్రిల్స్‌ ముఖ్యమని కేంద్ర వర్గాలు భావిస్తున్నాయి.

Hyderabad: నగరంలోని ఈ 4 ప్రాంతాల్లో బుధవారం మాక్ డ్రిల్..
Mock Drill

Updated on: May 06, 2025 | 4:08 PM

దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్‌ మోగుతోంది. మే 7, బుధవారం హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించనున్నారు. సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్స్‌లో మాక్ డ్రిల్స్‌ను నిర్వహించాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది. ఈ క్రమంలో సికింద్రాబాద్‌, గోల్కొండ, కంచన్‌బాగ్‌ DRDA, మౌలాలిలోని NFCలో డిఫెన్స్‌ బృందాలు మాక్‌డ్రిల్‌ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మే7, బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు మాక్‌ డ్రిల్‌ ఉంటుంది. రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శులతో.. కేంద్ర హోం శాఖ కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా సివిల్‌ డిఫెన్స్‌ మాక్‌ డ్రిల్‌ రిహార్సల్స్‌ చేపట్టింది. యుద్ధం వస్తే ఏం చేయాలి, ఎలా ఉండాలనే దానిపై అవగాహన కల్గిస్తున్నారు. మాక్ డ్రిల్స్‌లో ఎంపిక చేసిన ప్రజలకు, వాలంటీర్లకు శిక్షణ ఇస్తారు. ఒక ఏరియా నుంచి ప్రజలను సురక్షితంగా ఎలా తరలిస్తారనే దానిపైనా ట్రైనింగ్ ఉంటుంది. 1971 తర్వాత తొలిసారి దేశవ్యాప్తంగా మాక్‌ డ్రిల్స్‌ నిర్వహిస్తున్నారు. మెట్రో నగరాల్లో ఎయిర్‌ సైరన్ల ఏర్పాటు చేశారు.

దేశంలో 54 ఏళ్ల తర్వాత యుద్ధ సైరన్‌ మోగబోతోంది. బుధవారం దేశవ్యాప్తంగా సివిల్‌ మాక్‌డ్రిల్స్‌ నిర్వహించాలని కేంద్రం ఆదేశించడంతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం హైదరాబాద్‌లో నాలుగు ప్రాంతాల్లో మాక్‌ డ్రిల్‌ నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సికింద్రాబాద్‌, గోల్కొండ, కంచన్‌బాగ్‌ DRDA, మౌలాలిలోని NFCలో డిఫెన్స్‌ బృందాల మాక్‌డ్రిల్‌ నిర్వహించున్నాయి. హోం మంత్రిత్వ శాఖ సివిల్ డిఫెన్స్ రూల్స్- 1968లో సెక్షన్ 19 ప్రకారం ఈ డ్రిల్స్‌ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది.

ఇప్పటికే చాలా చోట్ల సిబ్బంది రిహార్సల్స్‌ చేస్తున్నారు. యుద్ధం వస్తే ఎలా వ్యవహరించాలనేదానిపై అవగాహన పెంచుకుంటున్నారు. మంటలు ఎలా ఆర్పాలి, గాయపడిన వారిని ఎలా తరలించాలి, ఎలాంటి ప్రథమ చికిత్స అందించాలనేవి ఈ రిహార్సల్స్‌ చేపట్టారు.

1971 పాక్‌‌తో యుద్ధం సమయంలో దేశవ్యాప్తంగా ఇలాంటి మాక్ డ్రిల్స్‌ నిర్వహించారు. ఇప్పుడు పహల్గామ్ ఘటన తర్వాత భారత్‌-పాక్‌ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇప్పుడు ఇవి చేపడుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అన్ని జిల్లాలో బుధవారం మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్నారు. బెంగాల్‌లో 23 జిల్లాల్లో 31 చోట్ల, మధ్యప్రదేశ్‌లో ఐదు చోట్ల, మహారాష్ట్రలో రత్నగిరి, సింధుదుర్గ్‌లో మాక్‌ డ్రిల్స్‌ నిర్వహించనున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.