Hyderabad: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. ట్రాఫిక్‌ ఇక్కట్లకు చెక్.. జనవరి 1న షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం

|

Dec 31, 2021 | 3:38 PM

ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ మరో భారీ వంతెన అందుబాటులోకి రాబోతున్నాయి. షేక్‌పేట జంక్షన్లలో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారంగా చేపట్టిన ఫ్లై ఓవర్ల నిర్మాణం ముగిసింది. ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. వాహనదారులకు న్యూ ఇయర్‌ కానుకగా..

Hyderabad: భాగ్యనగర సిగలో మరో మణిహారం.. ట్రాఫిక్‌ ఇక్కట్లకు చెక్.. జనవరి 1న షేక్ పేట్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం
Shaikpet Flyover
Follow us on

Shaikpet Flyover: హైదరాబాద్‌ వాసులకు ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. ఎల్‌బినగర్‌ – చాంద్రాయణగుట్ట రూట్‌ లో మరో ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్‌ ఈ ఫ్లై ఓవర్‌ని మంగళవారం ప్రారంభించారు. ట్రాఫిక్‌ పద్మవ్యూహాన్ని చీల్చుకుంటూ మరో భారీ వంతెన కూడా నగరవాసులకు అందుబాటులోకి రానుంది. షేక్‌పేట జంక్షన్లలో ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారంగా చేపట్టిన ఫ్లై ఓవర్ల నిర్మాణం ముగిసింది. ప్రారంభోత్సవానికి వేగంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. వాహనదారులకు న్యూ ఇయర్‌ కానుకగా ఈ ఫ్లై ఓవర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు పురపాలక శాఖ. జనవరి 1న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన ఈ ఫ్లై ఓవర్లతో ఈ జంక్షన్లలో వాహనదారులు రయ్‌ రయ్‌ మంటూ సాగిపోనున్నాయి. నగరంలో రెండో అతిపొడవైన ప్లై ఓవర్ కావడం విశేషం.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీని కోసం 2018లో SRDP కింద పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టింది. చాలా ప్రాంతాల్లో ఫ్లై ఓవర్‌ నిర్మాణాలు చేపట్టింది. ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ నిర్మాణాలు చేపట్టింది. ఇందులో భాగంగా 2018 ఏప్రిల్‌లో మిథాని- ఒవైసీ ఫ్లై ఓవర్‌ నిర్మాణాన్ని చేపట్టింది. తాజాగా ఈ ఫ్లై ఓవర్‌ని ప్రారంభించారు మంత్రి కేటీఆర్‌.

మేయర్‌ విజయలక్ష్మి, మంత్రులు మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ ఫ్లై ఓవర్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2018 ఏప్రిల్‌ లో SRDP కింద ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణం చేపట్టారు. 80 కోట్ల రూపాయలతో ఫ్లై ఓవర్‌ని నిర్మించారు. 3 లేన్లుగా 12 మీటర్ల వెడల్పుతో ఫ్లై ఓవర్‌ని నిర్మించారు. దీంతో మిథాని జంక్షన్‌, ఒవైసీ జంక్షన్‌ దగ్గర ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. ఆరాంఘర్‌, చాంద్రాయణగుట్ట, ఎల్‌బినగర్‌, కర్మాన్‌ఘాట్‌లో వాహనదారులకు ట్రాఫిక్‌ తిప్పలు తప్పనున్నాయి.

షేక్ పేట్ ఫ్లై ఓవర్..

రేతిబౌలి నుంచి ఆరులేన్లతో షేక్‌ పేట్‌ , ఫిలింనగర్‌ జంక్షన్‌ ఓయూ కాలనీ, విస్పర్‌ వ్యాలీ జంక్షన్‌ వరకు నిర్మించిన షేక్‌పేట్‌ ఫ్లై ఓవర్‌ ఇంటర్మిడియట్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణం నగరంలో రెండవ అతి పెద్దదిగా నిలవనున్నది. పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే తర్వాత 2.8 కిలోమీటర్ల పొడవులో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్‌తో హైటెక్‌ సిటీ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, గచ్చిబౌలి వెళ్లే వాహనదారులకు మహా ఉపశమనం లభించనున్నది. నిర్మాణంలో భాగంగా 74 పిల్లర్స్‌, 72 పియర్‌ క్యాప్స్‌, 440 పి.ఎస్‌.సి గడ్డర్స్‌,144 కాంపోసిట్‌ గ్రీడర్స్‌ ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లై ఓవర్ వినియోగంలోకి వస్తే ఆయా మార్గాల్లో ప్రయాణించేవారికి ట్రాఫిక్‌ చిక్కులు తగ్గడంతోపాటు తద్వారా ఇంధన వ్యయం, ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. అన్ని జంక్షన్ల వద్ద కాలుష్యం కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి: Congress Flag: కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఎగరక ముందే కిందపడ్డ జెండా.. ఉలిక్కిపడ్డ సోనియా గాంధీ!

Sourav Ganguly: సౌరవ్‌ గంగూలీకి కరోనా పాజిటివ్‌.. ఆస్పత్రిలో చికిత్స..