Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి

|

Jun 11, 2022 | 1:36 PM

హైదరాబాద్(Hyderabad) వాసులకు మరో గుడ్ న్యూస్. కైతలాపూర్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. బోరబండ ఎంఎంటీఎస్ స్టేషన్‌లో స్ట్రాటజిక్...

Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి రానున్న రోడ్డు ఓవర్ బ్రిడ్జి
Khaitalapur Bridge At Hyderabad
Follow us on

హైదరాబాద్(Hyderabad) వాసులకు మరో గుడ్ న్యూస్. కైతలాపూర్ రోడ్డు ఓవర్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. బోరబండ ఎంఎంటీఎస్ స్టేషన్‌లో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (SRDP) కింద దీనికి మరమ్మతులు చేపట్టారు. ఈ వంతెన కూకట్‌పల్లిని హైటెక్ సిటీతో కలుపుతుంది జేఎన్టీయూ, మలేషియా టౌన్‌షిప్, హైటెక్ సిటీ ఫ్లైఓవర్, సైబర్ టవర్ కూడలి వద్ద ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది. సనత్‌నగర్‌, బాలానగర్‌, సికింద్రాబాద్‌ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మాదాపూర్‌ ప్రధాన రహదారిపై మూసాపేట్‌ మీదుగా కైతలాపూర్‌ వైపు మళ్లిస్తారు. దీనివల్ల దూరం 3.5 కిలోమీటర్లు తగ్గుతుంది. ప్రయాణానికి పట్టే సమయం కనీసం ఒక గంట తగ్గుతుంది. బ్రిడ్జిపై రహదారి మొత్తం పొడవు 675.50 మీటర్లు, వెడల్పు సుమారు 16.6 మీటర్లు. ఇది 5.5 మీటర్ల సర్వీస్ లేన్‌ నిర్మతమైంది.

నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు ఎస్‌ఆర్‌డీపీ చేపట్టిన పనులు ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. ఖైతలాపూర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జితో పాటు చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్‌ జూన్ లోనే అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత పనులను ఈ సంవత్సరం డిసెంబర్‌ చివరి నాటికి పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి