తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసు నమోదు కాలేదు.. కరోనా జాగ్రతలు పాటించాలన్న మంత్రి హ‌రీశ్‌రావు

|

Dec 07, 2021 | 1:58 PM

తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసు నమోదు కాలేదన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు. ప్రజలందరూ వ్యాక్సిన్‌ తీసుకుని తప్పకుండా కరోనా జాగ్రతలు పాటించాలన్నారు. అంతకుముందు..

తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసు నమోదు కాలేదు.. కరోనా జాగ్రతలు పాటించాలన్న మంత్రి హ‌రీశ్‌రావు
Harish Rao
Follow us on

తెలంగాణలో ఒమిక్రాన్‌ కేసు నమోదు కాలేదన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు. ప్రజలందరూ వ్యాక్సిన్‌ తీసుకుని తప్పకుండా కరోనా జాగ్రతలు పాటించాలన్నారు. అంతకుముందు హైదరాబాద్​ నిమ్స్ ఆస్పత్రిను సందర్శించిన మంత్రి ఆసుపత్రిలోని మెడికల్‌ జెనెటిక్స్‌ లేబొరేటరీ మల్టీ డిసిప్లినరీ రీసెర్చ్‌ యూనిట్‌ను మంగ‌ళ‌వారం ప్రారంభించారు. నిమ్స్‌లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవ‌లు అందించేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని స్ప‌ష్టం చేశారు. నిమ్స్‌లో ఏర్పాటు చేసిన ఎండోస్కోపిక్ ప‌రిక‌రం, ఎంఆర్‌యూ ల్యాబ్‌, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెర‌పీ విభాగం, బోన్ డెన్సిటోమీట‌ర్, శాంపిల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం, వాట‌ర్ ఏటీఎంల‌ను మంత్రి హ‌రీశ్‌రావు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అన్ని విభాగాల హెచ్‌వోడీల‌తో మంత్రి హ‌రీశ్‌రావు స‌మీక్ష నిర్వ‌హించారు.

అనంత‌రం మంత్రి హ‌రీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.. రూ. 12 కోట్లతో మెడికల్ ప‌రిక‌రాల‌ను రోగుల‌కు అందుబాటులోకి తీసుకొచ్చామ‌ని తెలిపారు. రోగుల‌కు ఉన్న‌త చికిత్స‌లు అందించే ప‌రిక‌రాల‌ను ప్రారంభించామ‌ని తెలిపారు. జ‌న్యుప‌ర వ్యాధుల విశ్లేష‌ణ‌, గుర్తింపున‌కు కొత్త ల్యాబ్ ఏర్పాటు చేసిన‌ట్లు పేర్కొన్నారు. నిమ్స్‌లో రూ. 2.73 కోట్ల‌తో న్యూమాటిక్ ట్యూబ్ సిస్ట‌మ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామ‌న్నారు. రూ. 40 ల‌క్ష‌ల‌తో అత్యాధునిక న్యూరో ఎండోస్కోపి ఏర్పాటు చేశారు. నిమ్స్‌లో అద‌నంగా 200 ఐసీయూ ప‌డ‌క‌లు అందుబాటులోకి తీసుకొస్తామ‌న్నారు. ప్ర‌స్తుతానికి 155 ఐసీయూ ప‌డ‌క‌లు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. కొత్త బెడ్లు జ‌న‌వ‌రి 15 నాటికి అందుబాటులోకి రానున్నాయ‌ని పేర్కొన్నారు.

నిమ్స్‌లో ప్ర‌స్తుతం 89 వెంటిలేట‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని, మ‌రో 120 వెంటిలేట‌ర్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. నిమ్స్‌లో ప‌రిక‌రాల కోసం రూ. 154 కోట్లు మంజూరు చేశామ‌న్నారు. ఇక్క‌డ రూ.5 కే భోజ‌నం స‌ర‌ఫ‌రా చేయాల‌ని కోరారు. ఇది అమ‌లు చేస్తామ‌ని హ‌రీశ్‌రావు ప్ర‌క‌టించారు. ఒమిక్రాన్ కేసులు తెలంగాణ‌లో న‌మోదు కాలేద‌ని స్ప‌ష్టం చేశారు. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నామ‌ని మంత్రి తెలిపారు.

ఇవి కూడా చదవండి: Chanakya Niti: మీరు మీ జీవితంలో ఇలాంటి ముగ్గురికి చాలా దూరంగా ఉండండి.. వారు ఎవరో తెలుసుకోండి..

Crime News: గర్ల్‌ఫ్రెండ్‌తో గొడవ.. వీడియో కాల్ మాట్లాడుతూనే నదిలో దూకిన యువకుడు..