హైదరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణలో మిలాద్ ఉన్ నబీ వేడుకల సమయంలో అందరూ శాంతిభద్రతలు కాపాడుకోవాలని ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(మజ్లీస్ పార్టీ) అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదివారం ఓ బహిరంగ సభలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 28న రాష్ట్రంలో మిలాద్ ఉన్ నబీ, గణేష్ చతుర్థి పండుగలను జరుపుకుంటామని, ఆ సమయంలో అందరూ శాంతిభద్రతలను కాపాడుకోవడం తప్పనిసరి అన్నారు. తెలంగాణలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని కొందరు చూస్తున్నారని, అలాంటి వారికి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇవ్వరని తనకు తెలుసని ఓవైసీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మిలాద్ ఉన్ నబీ ర్యాలీ గురించి ఒవైసీ మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతియుత వాతావరణానికి భంగం కలగని విధంగా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
28 September ko Milad-un-Nabiﷺ bhi hai aur Ganesh Chaturthi bhi hai. Main Telangana ke awaam se appeal karta hoon ke wo aman ko barqaraar rakhiye#MiladunNabi #AIMIM #GaneshChaturthipic.twitter.com/yNF88gC67c
ఇవి కూడా చదవండి— Asaduddin Owaisi (@asadowaisi) September 3, 2023
అంతకుముందు, సున్నీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఇండియా (SUFI) ప్రతి సంవత్సరం రబీ ఉల్ అవ్వల్ 12వ రోజున నిర్వహించుకునే వార్షిక మిలాద్ ఉన్ నబీ ర్యాలీని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీలో లా అండ్ ఆర్డర్‌ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సున్నీ యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఇండియా తెలిపింది.
కాగా, తెలంగాణ రాష్ట్ర పోర్టల్ క్యాలెండర్‌లో రాష్ట్ర ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ నాడు సెలవు ప్రకటించింది. క్యాలెండర్ ప్రకారం గణేష్ చతుర్థీ కోసం ప్రకటించిన సెలవు దినాల్లోనే మిలాద్ ఉన్ నబీ పండుగ కూడా వచ్చింది. ఇంకా పోర్టల్ క్యాలెండర్ ప్రకారం సెప్టెంబర్ నెలలో 6వ తేదీన అర్బయీన్, 7న శ్రీ కృష్ణ అష్టమి అలాగే 18న వినాయక చతుర్థి, 28న మిలాద్ ఉన్ నబీ పండుగలు ఉన్నాయి.
హైదరాబాద్‌లో శాంతిభద్రతలను కాపాడే క్రమంలో పోలీసులకు శాంతి కమిటీ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారని, సెంట్రల్ పీస్ కమిటీకి చెందిన 500 మంది సభ్యులతో నిర్వహించిన సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. బంజారాహిల్స్‌లోని టీఎస్‌పీఐసీసీసీ ఆడిటోరియంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్లాట్ ఫామ్‌లో జరిగే దుష్ప్రచారరాల వ్యాప్తిని నిరోధించే విధంగా పీస్ కమిటీలోని ఐటీ విభాగాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పండుగ, ఊరేగింపుల సమయంలో తప్పుడు ప్రచారం జరిగే అవకాశం ఉందని, వాటిపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పి్స్తూ పీస్ కమిటీ సభ్యులు పనిచేయాలని ఆయన కోరారు. సమాజంలోని 0.1 శాతం మంది మాత్రమే శాంతిభద్రతలకు విఘాతం కల్గించే ప్రయత్నాలు చేస్తుంటారని, వారిని అందరూ కలిసి ఎదుర్కోవాలన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..