రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం డ్రగ్స్ అక్రమ దందాకు అడ్డుకట్ట వేస్తున్నా.. కేటుగాళ్లు మాత్రం తమ అక్రమ రవాణాను యదేచ్చగా కొనసాగిస్తూనే ఉన్నారు. అయితే పోలీసులు ఏమైనా తక్కువా.. వారి ఆట కట్టిస్తూ.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
విశ్వసనీయ సమాచారంతో MDMA డ్రగ్స్‌ను విక్రయానికి యత్నించిన ఇద్దరు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్‌గా అరెస్ట్ చేశారు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు. దుండిగల్ పీఎస్ పరిధి గండి మైసమ్మలో ఇద్దరు వ్యక్తులు అనుమానస్పదంగా ద్విచక్ర వాహనంలో వెళుతుండగా.. వారిని ఆపి క్షుణ్ణంగా చెక్ చేశారు ఎక్సైజ్ అధికారులు. వాహనం తనిఖీల్లో.. వారి వద్ద ఉన్న టూల్ కిట్ బాక్స్ చెక్ చేయగా.. అందులో ఎండీఎంఏ డ్రగ్స్ క్రిస్టల్స్ ఉన్నట్టు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని.. నిందితులైన క్రాంతి, మహమ్మద్ సోయల్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఆ డ్రగ్స్ దాదాపు రెండున్నర లక్షల విలువైనదిగా పోలీసులు అంచనా వేస్తున్నారు. బెంగళూరు నుంచి కిరణ్ అనే వ్యక్తి ద్వారా హైదరాబాద్‌కి ఈ డ్రగ్స్‌ను తీసుకువచ్చినట్లుగా ఎక్సైజ్ పోలీసులు కనిపెట్టారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు.
ఇది చదవండి: ఉన్నట్టుండి నిద్రపోతున్న చిన్నారి ఉయ్యాల పైకెక్కిన కింగ్ కోబ్రా.. ఆ తర్వాత ఇది సీన్..
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..