Mastan Sai Case: ఆ వీడియోల్లో ఉన్న అమ్మాయిలు ఎవరు..? విచారణలో మస్తాన్‌ సాయి ఏం చెప్పాడంటే

మస్తాన్‌సాయి మూడు రోజుల విచారణలో..హార్డ్ డిస్క్‌లు, డ్రగ్స్ పార్టీలపై ఆరా తీసిన పోలీసులకు..పలు అంశాలపై క్లారిటీ వచ్చింది. హార్డ్‌డిస్క్‌లో 17ఫోల్డర్లను ఓపెన్ చేశారు పోలీసులు మరి ఆ వీడియోల్లో ఉన్న అమ్మాయిలు ఎవరు..? విచారణలో మస్తాన్‌ సాయి ఏం చెప్పాడు..? డ్రగ్స్ గురించి ఎలాంటి క్లారిటీ ఇచ్చాడు..?

Mastan Sai Case: ఆ వీడియోల్లో ఉన్న అమ్మాయిలు ఎవరు..? విచారణలో మస్తాన్‌ సాయి ఏం చెప్పాడంటే
Mastan Sai

Updated on: Feb 23, 2025 | 9:07 AM

నగ్న వీడియోలు, డ్రగ్స్‌ పార్టీల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయిని మూడు రోజుల పాటు ప్రశ్నించారు పోలీసులు. హార్డ్ డిస్క్‌లు, డ్రగ్స్ పార్టీలు, సాఫ్ట్‌వేర్ వంటి అంశాలపై ఆరా తీశారు. అయితే మూడు రోజుల విచారణలో పలు అంశాలను వెల్లడించిన మస్తాన్‌సాయి..డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు.

మస్తాన్‌సాయికి చెందిన హార్డ్ డిస్క్‌లలో 17 ఫోల్డర్లను పరిశీలించిన పోలీసులు..వాటిలో ఆరుగురు మహిళలకు సంబంధించిన వీడియోలు, వీడియో కాల్‌ రికార్డింగ్స్‌ను గుర్తించారు. వీటిలో లావణ్యతో పాటు.. మస్తాన్ సాయి గర్ల్‌ఫ్రెండ్స్, అతని భార్యకు సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. మొత్తం 2500కు పైగా ఫోటోలు, 505కు పైగా వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్‌ను పోలీసులు గుర్తించారు. లావణ్య ఫోన్ నుండి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్‌ను క్విక్ షేర్ ద్వారా పొందినట్లు ఒప్పుకున్నాడు..మస్తాన్ సాయి. అలాగే పోడ్‌కాస్ట్ ఫోల్డర్‌లో ఫోన్ హ్యాక్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్‌ను కూడా గుర్తించారు..పోలీసులు.

మరోవైపు హైదరాబాద్‌ సిటీ సివిల్ కోర్టులో తాజాగా పిటిషన్ ఫైల్ చేశాడు..మస్తాన్ సాయి. తన వీడియోలు డిలీట్ చేయించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషన్‌లో న్యాయమూర్తిని కోరారు. మరోవైపు ఈ పిటిషన్‌పై స్పందించిన లావణ్య లాయర్‌..తప్పుడు అడ్రస్‌తో మస్తాన్‌సాయి మరోసారి కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.

మొత్తానికి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో వందల వీడియోలపై పోలీసులకు క్లారిటీ వచ్చినట్టు తెలుస్తోంది.మస్తాన్‌సాయి మీడియాతో చెప్పినట్టు హార్డ్‌డిస్క్‌లో అతడి భార్యతో పాటు మాజీ గర్ల్ ఫ్రెండ్స్‌కు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అయితే డ్రగ్స్‌పై మాత్రం మస్తాన్ సాయి నోరు మెదపనట్లు తెలుస్తోంది. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు అనే ప్రశ్నలకు మస్తాన్ సాయి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆ వ్యవహారంపై ఆరా తీసే పనిలో పడ్డారు..పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..