Hyderabad: నిలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన రోగులు, జనం..

|

Feb 07, 2024 | 5:43 PM

Fire Accident in Nilofar Hospital: హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.

Hyderabad: నిలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన రోగులు, జనం..
Nilofar Hospital
Follow us on

Fire Accident in Nilofar Hospital: హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. దీంతో అధికారులు హుటాహుటిన అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా.. నిలోఫర్ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదంతో.. ఆసుపత్రి ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో రోగులు, అక్కడున్న జనం భయాందోళనతో పరుగులు తీశారు..

కాగా.. నీలోఫర్ ఆసుపత్రిలోని ల్యాబ్ లో మంటలు చెలరేగినట్లు సిబ్బంది రోగులు చెబుతున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో దట్టమైన పొగ వ్యాపించడంతో.. రోగులను, వారి కుటుంబసభ్యులను బయటకు తీసుకువచ్చేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..