Hyderabad: భర్త సంసారానికి పనికిరాడని విడాకులకు అప్లై.. అంతలోనే మానస మరణం.. మిస్టరీ

పెళ్లైన యువతి మరణం హైదరాబాద్‌లో సంచలనంగా మారింది. భర్తతో విడాకులకు అప్లై చేశాక ఆమె అనూహ్యంగా బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించింది.

Hyderabad: భర్త సంసారానికి పనికిరాడని విడాకులకు అప్లై.. అంతలోనే మానస మరణం.. మిస్టరీ
Sudden Death

Updated on: Apr 11, 2022 | 6:12 PM

Telangana: హైదరాబాద్‌లో వనస్థలిపురం(Vanasthalipuram)లో తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. తమ కుమార్తె మరణానికి అత్తింటివారే కారణమని వనస్థలిపురంలో ధర్నాకి దిగారు యువతి కుటుంబ సభ్యులు. దీంతో హైటెన్షన్ నెలకుంది. దీంతో ఉన్నతాధికారులు మహిళా పోలీసులతో పాటు పారా మిలటరీ బలగాలను అక్కడ భారీగా మోహరించారు. వివరాల్లోకి వెళ్తే.. 2017లో మానస అనే యువతిని, దేవి రెడ్డి అనే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించారు పెద్దలు. దాంపత్య జీవితం ప్రారంభించిన కొద్ది  కాలానికే వారి మధ్య కలహాలు చెలరేగాయి. దీంతో ఇరువురు దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తన భర్త సంసారానికి పనికిరాడని విడాకులకు అప్లై చేసింది మానస. దీంతో ఆమెకు అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఇటీవల తీవ్ర అస్వస్థతకు లోనైన మానస.. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయింది. ఆమె మరణానికి అత్తింటివారే కారణమంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. శాస్త్రం ప్రకారం.. మానసకు దహన సంస్కారాలు నిర్వహించడానికి అత్తింటివారు నిరాకరించారు. దీంతో మానస కుటుంబ సభ్యులు, బంధువులు.. భారీగా అక్కడికి చేరుకున్నారు. దేవి రెడ్డి డబ్బులతో పోలీసులను మ్యానేజ్ చేస్తున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. ఆ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు అధికారులు. ఘటనపై వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Viral: ఛాలెంజ్​ పేరుతో పైత్యం.. ఫ్రూట్ ​జ్యూస్​లో వయాగ్రా పిల్స్ 

 

Loading...
Unable to load recommendations.
Follow Us