Hyderabad: ఐఏఎస్‌ల నుంచి ఐపీఎస్‌ల వరకు దర్శించుకునే గణనాథుడు..

| Edited By: Narender Vaitla

Sep 14, 2024 | 9:23 PM

ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బాలాపూర్ నుండి చాంద్రాయణగుట్ట మీదుగా ట్యాంక్ బండ్ వైపు గణేశ్ నిమజ్జనం ఊరేగింపుకు సంబంధించిన రోడ్డు మార్గాలను పరిశీలించారు. పోలీస్ శాఖ తరఫున నిర్వహణలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు...

Hyderabad: ఐఏఎస్‌ల నుంచి ఐపీఎస్‌ల వరకు దర్శించుకునే గణనాథుడు..
Hyderabad
Follow us on

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్ వేడుకలు ఎంతో ఘనంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డీజిపి శ్రీ జితేందర్ ఐపీఎస్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఐపీఎస్, అనుదీప్ ఐఏఎస్, ఆమ్రపాలి ఐఏఎస్, అడిషనల్ కమిషనర్లు, డీసీపీలు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారి నేతృత్వంలో బాలాపూర్ గణేశ్‌ విగ్రహ దర్శనం చేసుకున్నారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ అధికారులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి బాలాపూర్ నుండి చాంద్రాయణగుట్ట మీదుగా ట్యాంక్ బండ్ వైపు గణేశ్ నిమజ్జనం ఊరేగింపుకు సంబంధించిన రోడ్డు మార్గాలను పరిశీలించారు. పోలీస్ శాఖ తరఫున నిర్వహణలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని, ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు. గణేశ్ విగ్రహాల ఏర్పాట్లు, నిమజ్జనం ప్రణాళికలు చక్కగా జరగడం కోసం కమిటీలు, భక్తుల సహకారం అవసరమని అధికారులు స్పష్టం చేశారు.

 

బాలాపూర్ నుంచి నిమజ్జనం జరుపుకునే దారిలో రోడ్లను బాగు చేస్తుండటం వల్ల ఊరేగింపు సజావుగా సాగేందుకు కృషి చేస్తున్నారు. గణేశ్‌ శోభాయాత్రలో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా ఉండేందుకు పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. గణేశ్ నిమజ్జనం కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో జరుపుకొనే అతిపెద్ద ఉత్సవాలలో ఒకటైనందున భక్తులు ఈ వేడుకలను శాంతియుతంగా, ఘనంగా జరుపుకోవాలని డీజిపి శ్రీ జితేందర్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ చిగిరింత పారిజాత నరసింహా రెడ్డి, కార్పొరేటర్లు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..