Hyderabad: హైదరాబాద్ మార్కెట్‌లో మామిడి పండ్లు.. కేజీ ఎంతో తెల్సా.

పండ్లలో రారాజు మామిడి పండు. సాధారణంగా మామిడి పండ్లంటే ఇష్టపడని వాళ్లే ఉండరు. ముఖ్యంగా వేసవి కాలం వచ్చిందంటే లొట్టలేసుకుంటూ మామిడి పండ్లను తిండం చూస్తుంటాం. ప్రస్తుతం మార్కెట్లో మామిడి పళ్లు నోరూరిస్తున్నాయ్‌.. చూడగానే ముచ్చటేస్తున్నాయ్‌. ధరలు ఎలా ఉన్నా.. తినాలనే కోరిక మాత్రం ఆగడం లేదు. సమ్మర్‌లో స్వీట్‌ మ్యాంగో టేస్ట్‌ చేకుంటే ఆ జీవితమే వేస్ట్‌ అనిపిస్తుంది.

Hyderabad: హైదరాబాద్ మార్కెట్‌లో మామిడి పండ్లు.. కేజీ ఎంతో తెల్సా.
Mangoes

Edited By:

Updated on: Feb 25, 2025 | 4:43 PM

హైదరాబాద్‌లో మామిడి సీజన్ మొదలైంది. ఫిబ్రవరి మొదటి వారం నుండే మార్కెట్లోకి మామిడి కాయలు రావడం వచ్చేస్తున్నాయి.  ప్రస్తుతం ధరలు అంతగా లేకపోయినా రాను రాను పెరిగే అవకాశాలు ఉన్నాయి. హోల్‌సేల్ మార్కెట్లో కిలో 60 – 70 రూపాయల వరకు పలుకుతోంది.
రిటైల్ మార్కెట్‌లో కిలో వంద రూపాయల అమ్ముతున్నారు. దిగుబడి తగ్గిన కారణంగా బహిరంగ మార్కెట్‌లో ఈ ఏడాది ధరలు కాస్త ఎక్కువ గానే ఉండవచ్చని వ్యాపారులు అంటున్నారు. ఇప్పటికే బాట సింగారం మార్కెట్‌కు 1,470 క్వింటాళ్ల మామిడి దిగుమతి అయిందని మార్కెట్ లెక్కలు చెబుతున్నాయి. గత ఏడాది మామిడి సీజన్ ఏప్రిల్ నెలలో పుంజుకోగా ఈ ఏడాది మార్చిలోనే జోరు అందుకుంటుందని వ్యాపారులు అంటున్నారు.

అయితే ఈ ఏడాది పూత సమయంలో వర్షాలు బాగా కురవడంతో మామిడి చెట్లుకు నష్టం బాగా జరిగిందని.. అనుకున్న స్థాయిలో పంట రాలేదని రైతులు అంటున్నారు. మొదట్లో వచ్చిన పూతతోనే మామిడి సీజన్ తొందరగా ప్రారంభమైందని అంటున్నారు. గత ఏడాది మార్చి మూడో వారం నాటికి దాదాపు 2 వేల టన్నుల మామిడి మార్కెట్‌కు దిగుమతి కాగా..  ఈ ఏడాది ఇప్పటికే 4 వేల టన్నుల వరకు వచ్చింది. మార్చి రెండు, మూడో వారానికి రోజుకు వెయ్యి టన్నుల మామిడి పండ్లు మార్కెట్‌కు రావచ్చని అంచనా. దీంతో మార్కెట్ అధికారులు మామిడి సీజన్‌కు సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. మార్కెట్‌కు ప్రతి రోజూ 100 టన్నుల మామిడి దిగుమతి అవుతుంది.

కానీ ఇప్పుడు వచ్చే మామిడి కాయలు అంత రుచిగా ఉండడం లేదని.. కొన్ని మామిడికాయలలో పురుగులు కూడా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు. ఇప్పుడు వచ్చే మామిడి కాయలకు క్యాల్షియం కార్బైడ్ వేసి పండ పెడుతున్నారని అందుకే అవి తొందరగా..  మగ్గుతున్నాయని.. ఇలాంటి పండ్లు తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని.. సీజన్‌లో వచ్చే పండ్లు తినడం ఉత్తమమని వైద్యులు అంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి