Hyderabad: భారీ వర్షం.. పాతబస్తీలో ఊడిపడిన మచిలీకమాన్‌ పెచ్చులు.. కొంచెం అయితే.. వామ్మో..

హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది.. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.. భారీ వర్షం కారణంగా పాతబస్తీ ప్రాంతంలోని చార్మినార్ సమీపంలోని మచ్లీ కమాన్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

Hyderabad: భారీ వర్షం.. పాతబస్తీలో ఊడిపడిన మచిలీకమాన్‌ పెచ్చులు.. కొంచెం అయితే.. వామ్మో..
Machli Kaman

Edited By: Shaik Madar Saheb

Updated on: Oct 08, 2025 | 9:22 AM

హైదరాబాద్ నగరంలో మంగళవారం భారీ వర్షం కురిసింది.. దీంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.. భారీ వర్షం కారణంగా పాతబస్తీ ప్రాంతంలోని చార్మినార్ సమీపంలోని మచ్లీ కమాన్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి గాయపడిన వ్యక్తిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కాగా.. మచిలీకమాన్‌ పెచ్చులు ఊడిపడటంతో.. ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా అధికారులు రంగంలోకి దిగారు.. మరమ్మతు పనులపై అంచనా వేస్తున్నారు. అంతేకాకుండా.. తీసుకోవాల్సిన చర్యలపై కూడా అధికారులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. కాగా.. ఈ ఘటన పాతబస్తీ వాసుల్లో ఆందోళనను కలిగించింది.. వర్షాకాలంలో పాత భవనాల భద్రతపై ప్రశ్నలు తలెత్తిస్తున్నాయి. ఈ సంఘటనపై వెంటనే స్పందించిన చార్మినార్ ఎమ్మెల్యే.. మచ్లీ కమాన్‌తో పాటు ఫత్తర్‌ఘట్టి ప్రాంతాలకు వెళ్లి పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి భవనాల పరిస్థితిని, ప్రమాదాన్ని అంచనా వేశారు. భవిష్యత్‌లో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

ఇంతకుముందు కూడా పాతబస్తీలోని చార్మినార్ సహా.. పలు పాత భవనాలు వర్షాలతో ధ్వంసమైన ఘటనలు ఉన్నాయి. దీంతో నగర మున్సిపల్ అధికారులు, GHMC విభాగాలు పాత భవనాలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని స్థానికులు కోరుతున్నారు. ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి ప్రజల భద్రత కోసం తక్షణం మచ్లీ కమాన్‌కు మరమ్మతులు చేపట్టాలని కోరారు. ప్రజలు వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలని, పాత భవనాల్లో నివాసం ఉండే వారు భద్రతాపరంగా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

వీడియో చూడండి..

GHMC, రెవెన్యూ శాఖలు పాత భవనాలను గుర్తించి వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అవసరమైతే రీకన్స్ట్రక్షన్ లేదా ఖాళీ చేయించే విధంగా చొరవ చూపాలని సూచించారు. ఈ ఘటన మరోసారి పాతబస్తీలో పాత భవనాల పరిస్థితిపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వర్షాకాలం మరికొన్ని వారాల పాటు కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..