Hyderabad Old City: తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని పాతబస్తీలో దారుణం వెలుగు చూసింది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిలాల్ నగర్‌లో కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య, పిల్లలపై గన్ గురి పెట్టి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. వారు వెంటనే అప్రమత్తమై తప్పించుకోవడంతో పెను ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలాల్ నగర్‌లో నివాసం ఉంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి హాబీబ్ హష్మి, అతని కటుంబ సభ్యుల మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురై సహనం కోల్పోయిన హాబీబ్ హష్మి భార్య, పిల్లలపై కాల్పులకు పాల్పడ్డారు. వారు అప్రమత్తమై క్షణాల్లో తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు. అయితే బుల్లెట్‌లు గోడకి తగలడంతో గోడ పాక్షికంగా ధ్వంసమైంది. ఇదిలాఉంటే.. హాబీబ్ హష్మీ కొడుకు సయ్యద్ ఉమర్ హష్మీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హాబీబ్ హష్మీని అదుపులోకి తీసుకుని రివాల్వర్‌ని సీజ్ చేశారు.
Also read:
Nikhil Siddharth : వరుస సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో… మెగాహీరో కథతో సినిమా చేస్తున్న నిఖిల్..