ఎవడైనా మీదికొస్తే ఇలా ఎదుర్కోవాలి.. విద్యార్థినులకు సెల్ఫ్‌డిఫెన్స్‌లో మెళకువలు..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జనగాం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఫిట్ ఇండియా పౌండేషన్ ఆద్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలల్లో భాగంగా..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జనగాం జిల్లాలో ఘనంగా జరిగాయి. ఫిట్ ఇండియా పౌండేషన్ ఆద్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఈ వేడుకలల్లో భాగంగా తెలంగాణ రెసిడెన్షియల్ మహిళా కళాశాలలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్ధినులకు సెల్ఫ్ డిఫెన్స్ పై మెళకువలు, ఆత్మరక్షణ మరియు టెక్నిక్స్ నేర్పించారు.
జిల్లాలోని జనగామ మండలం పెంబర్తి గ్రామంలోని తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాలల్లో ఫిట్ ఇండియా పౌండేషన్ వారు మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిదులుగా స్థానిక మార్కెట్ చైర్మన్ విజయ హయరయ్యారు. ఇందులో వివిధ రంగాల్లో నిష్ణాతులైన మహిళను ఫిట్ ఇండియా సభ్యులు ఘనంగా సన్మానించారు. అనంతరం చైర్మన్ మాట్లడుతూ తమ హక్కులతో పాటు భాద్యతలను గుర్తెరగాలని కోరారు.
మహిళలపై ఇప్పటికీ దాడులు, అగాయిత్యాలు జరుగుతున్నాయని, వాటిని అచంచలమైన ధృడ విశ్వాసంతో ఎదుర్కోవాలని పిలుపు నిచ్చారు. మహిళా దినోత్సవాన్ని పురుషులు కూడా జరుపుకోవడం గౌరవించాల్సిన విషయం అని చైర్మన్ విజయ అన్నారు.
ఈ కార్యక్రమంలో మహిళా కలశాల విద్యార్థినిలకు సెల్ఫ్ డిఫెన్స్ లో మెళకువలు నేర్పించారు. సమాజంలో ఎదురౌతున్న సమస్యలు, దాడులను ఎదుర్కొనే టెక్నిక్స్, ఆత్మరక్షణ పద్దతులు, కరాటే తదితర వాటిపై ఫిట్ ఇండియా పౌండేషన్ సబ్యులు తర్ఫీదు ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు.
Read More:
దిశ వాహనాలను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్.. మహిళా దినోత్సవం నాడు ఏపీ ప్రభుత్వం వరాలు
ఓవైపు వరాలు.. మరోవైపు ఆందోళనలు.. మహిళా దినోత్సవం నాడు అట్టుడికిన అమరావతి గ్రామాలు