AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓవైపు వరాలు.. మరోవైపు ఆందోళనలు.. మహిళా దినోత్సవం నాడు అట్టుడికిన అమరావతి గ్రామాలు

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏపీ సీఎం జగన్‌ మహిళలకు ఓవైపు వరాలు ప్రకటిస్తుండగా మరోవైపు మహిళలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో అమరవాతి జిల్లాల్లో..

ఓవైపు వరాలు.. మరోవైపు ఆందోళనలు.. మహిళా దినోత్సవం నాడు అట్టుడికిన అమరావతి గ్రామాలు
K Sammaiah
|

Updated on: Mar 08, 2021 | 1:43 PM

Share

అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఏపీ సీఎం జగన్‌ మహిళలకు ఓవైపు వరాలు ప్రకటిస్తుండగా మరోవైపు మహిళలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో అమరవాతి జిల్లాల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించునేందుకు వెళుతున్నఅమరావతి మహిళా రైతులను పోలీసులు అడ్డుకున్నారు. 447 రోజులుగా ఉద్యమం చేస్తున్నామని, ఇవాళ అమ్మవారిని దర్శించుకుందామని వస్తే.. బ్యారేజ్ వద్ద తమను పోలీసులు అడ్డుకుని వ్యాన్‌లో ఎక్కించి ఎక్కడకు తీసుకువెళుతున్నారో అర్థం కాలేదన్నారు. కొందరినైతై మంగళగిరి పీఎస్‌లో మూడు గంటలు ఉంచి తర్వాత వెంకటపాలెంవద్ద వదిలిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళా దినోత్సవం రోజున తమకు అవమానం జరిగిందన్నారు మహిళలు. సుమారు వంద మంది పోలీసులు తమపై దారుణంగా వ్యవహరించారని వాపోయారు. అయినా తమ ఉద్యమం అపేదిలేదని, ఏపీకి ఏకైక రాజధాని అమరావతి అని ప్రభుత్వం ప్రకటించే వరకు ఆందోళన చేస్తామని మహిళలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రతి ఒక్క మహిళకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా టీడీపీ నాయకురాలు ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చి మహిళలకు మద్దతు తెలిపారు.

ప్రకాశం బ్యారేజీపై అమరావతి మహిళా రైతులు భారీ ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అయితే విషయం తెలియడంతో ముందే అప్రమత్తమైన పోలీసులు తెల్లవారు జామునుంచే తనిఖీలు చేపట్టారు. బ్యారేజీపై బైఠాయించి నిరసన తెలుపుదామనుకున్న మహిళల్ని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మహిళా రైతులను మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. విషయం తెలుసుకున్న రాజధాని ప్రాంత వాసులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేశారు. సేవ్ అమరావతి అంటూ నినాదాలు చేస్తూ సీడ్‌ యాక్సిస్‌ రోడ్డుపైకి భారీగా చేరుకున్నారు. అప్పటికే పికెటింగ్ ఏర్పాటు చేసిన పోలీసులు.. మహిళలు బయటకు రాకుండా అడ్డుకున్నారు.

ప్రకాశం బ్యారేజీపై అందోళన చేస్తున్న మహిళా రైతులను నిర్భందించడంతో రాజధాని గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయపూడి నుంచి మందడం వైపు వస్తున్న మహిళలను పోలీసులు వెలగపూడి దగ్గరు అడ్డుకున్నారు. రోడ్డుపై ముళ్ల కంచెలు వేసి రాకపోకల్ని ఆపేశారు. మందడం శివాలయం సెంటర్లో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. అమరావతికి మద్దతుగా నినాదాలు చేశారు. అయితే ధర్నా చేస్తున్న మహిళలకు అల్పాహారం అందిస్తుండగా.. పోలీసులు అడ్డుకోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ మహిళలు పురుగుల మందు డబ్బాలను చేతపట్టుకుని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

రాజధాని రైతులు వెలగపూడిలోని సచివాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు మళ్లీ అక్కడ అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళలు కిందపడ్డారు. ఏడాదికి పైగా తాము నిరసనలు చేస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందించడం లేదని.. కనీసం మహిళ దినోత్సవం రోజు కూడా మహిళలకు రక్షణ లేకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మహిళలకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read More:

భద్రాద్రి రాములవారికి బండి పూజలు.. భైంసా సంఘటనను ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ క్షమించదన్న సంజయ్‌