AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మమతా బెనర్జీ తరఫున ప్రచారం చేస్తే రూ. 50 లక్షలు ఇస్తామన్నారు, ఫరూక్ అబ్దుల్లా

ప్రస్తుత ఎన్నికల సీజన్ లో ఒక పార్టీ నేతపై మరొకరిని రెచ్ఛగొట్టేందుకు, వారి మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జమ్మూ కాశ్మీర్ నేషనల్  కాన్ఫరెన్స్ చైర్మన్, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు.

మమతా బెనర్జీ తరఫున ప్రచారం చేస్తే రూ. 50 లక్షలు ఇస్తామన్నారు, ఫరూక్ అబ్దుల్లా
Umakanth Rao
| Edited By: Anil kumar poka|

Updated on: Mar 08, 2021 | 1:59 PM

Share

ప్రస్తుత ఎన్నికల సీజన్ లో ఒక పార్టీ నేతపై మరొకరిని రెచ్ఛగొట్టేందుకు, వారి మధ్య వైషమ్యాలు పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని జమ్మూ కాశ్మీర్ నేషనల్  కాన్ఫరెన్స్ చైర్మన్, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. ఎన్నికల ప్రయోజనాలకోసం భారతీయ జనతా పార్టీ ఈ విధమైన అసత్యాలను, ప్రచారాన్ని వ్యాపింపజేస్తోందన్నారు. తనను ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా చెప్పుకున్న ఓ వ్యక్తి కొన్ని రోజుల క్రితం తనకు ఫోన్ చేసి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తరఫున ప్రచారం చేయాలని, ఇందుకు 50 లక్షలు ఇస్తామని చెప్పాడని ఆయన వెల్లడించారు. దీనిపై తాను ఝార్ఖండ్ ముక్తి మోర్చా ఎంపీనొకరిని వాకబు చేయగా..ఆ వ్యక్తి ….మాజీ ప్రధాని, జేడీ-ఎస్ అధినేత దేవెగౌడకు కూడా ఫోన్ చేసి ఇలాగే మమత తరఫున ప్రచారం చేయాలని కోరాడని చెప్పారన్నారు. ఇదంతా చూస్తుంటే మా మధ్య విభేదాలు సృష్టించడానికి బీజేపీ ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నట్టు  తెలుస్తోందని ఫరూక్ అబ్దుల్లా మండిపడ్డారు.

అయితే ఈ విధమైన ఎత్తుగడలకు తాము బెదిరేది లేదన్నారు. అసలు తనవంటి సీనియర్ నేతను ‘ఛీట్’ చేయడానికి వీరికి ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. ఈ ఎన్నికల తరుణంలో ఈ విధమైన ఫేక్ కాల్స్ లేనిపోని గందరగోళాన్ని సృష్టిస్తాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని పునరుధ్ధ రించాలని ఆయన డిమాండ్ చేశారు. 370 అధికరణాన్నికేంద్రం రద్దు చేయడాన్ని ఫరూక్ అబ్దుల్లా ప్రస్తావిస్తూ..దీనిపై తాము పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.  ఈ విషయంలో తాను లోగడ చైనా లేదా పాకిస్థాన్ సాయాన్నైనా కోరుతానని ప్రకటించినట్టు వార్తలు వచ్చాయని, కానీ దాన్ని కొన్ని పత్రికలు  వక్రీకరించాయని చెప్పారు. నిజానికి దీనిపై పోరాటం కొనసాగిస్తానని తాను వ్యాఖ్యానించానన్నారు.అటు జమ్మూ కాశ్మీర్ కి రాష్ట్ర ప్రతిపత్తిని  పునరుధ్ధరించాలన్న డిమాండ్ ఈ కేంద్ర పాలిత ప్రాంతంలో ఊపందుకుంటోంది.  తాము రైతుల తరహాలో ఆందోళన చేస్తామని పీడీపీ చీఫ్ మెహబూబా ముప్తీ ఇటీవల ప్రకటించారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

ఖమ్మం జిల్లాలో విషాదం.. మూడో పెళ్లి చేసుకున్న మహిళ అనుమానాస్పద మృతి..

ఓవైపు వరాలు.. మరోవైపు ఆందోళనలు.. మహిళా దినోత్సవం నాడు అట్టుడికిన అమరావతి గ్రామాలు