Hyderabad: కోడలి అస్థికలు కలిపేందుకు నీటిలోకి దిగిన మామ.. అంతలోనే షాకింగ్

|

Dec 23, 2021 | 5:31 PM

చావు ఎప్పుడు.. ఎలా వెంటాడుతుందో మనం చెప్పలేం. విధి ఆడే వింత ఆటలో మనం పావులం మాత్రమే.

Hyderabad: కోడలి అస్థికలు కలిపేందుకు నీటిలోకి దిగిన మామ.. అంతలోనే షాకింగ్
Ash Immersion
Follow us on

చావు ఎప్పుడు.. ఎలా వెంటాడుతుందో మనం చెప్పలేం. విధి ఆడే వింత ఆటలో మనం పావులం మాత్రమే. ఎటునుంచైనా ప్రమాదం ముంచుకు రావొచ్చు. ఏ క్షణం అయినా ఆయువు ఆగిపోవచ్చు. తాజాగా హైదరాబాద్‌లో నగర శివారు, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా శామీర్‌పేటలో అలాంటి ఘటనే జరిగింది. కోడలి అస్థికలు కలిపేందుకు వచ్చిన మామ ప్రమాదవశాత్తు చెరువులో జారిపడి మృత్యువాతపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే… సికింద్రాబాద్‌ తూకారంగేట్‌ నార్త్‌ లాలాగూడకు చెందిన కొండోజు దేవానంద్‌(67) అన్న తనయుడి భార్య ఇటీవల కన్నుమూసింది. దీంతో ఆమె అస్థికలు కలిపేందుకు ఐదుగురు కుటుంబ సభ్యులతో కలిసి దేవానంద్ బుధవారం శామీర్‌పేట పెద్ద చెరువుకు వచ్చారు. అందరూ కలిసి అస్థికలు నీటిలో కలిపారు.

అనంతరం దేవానంద్‌ బండరాయిపై కూర్చొని స్నానం చేస్తుండగా నీటిని అందుకునే క్రమంలో ప్రమాదవశాత్తు జారి చెరువులో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునిగిపోయాడు. కాపాడేందుకు కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో నీటిలో  ఊపిరాడక ఆయన మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: ‘డబ్బుపై ఆశతోనే..’ నాని కామెంట్స్‌పై ఘాటుగా రియాక్టయిన మంత్రి బొత్స, ఎమ్మెల్యే విష్ణు..

జక్కన్న బిగ్ ప్లాన్.. RRR తెలుగు ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌‌కు అతిథులుగా ఆ ఇద్దరు హీరోలు!