Malla Reddy Profile: ‘పాలమ్మినా..పూలమ్మినా..రికార్డుల్లోకెక్కినా’ మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానమిదే..

Malla Reddy Telangana Election 2023: పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడినా.. ఫేమస్ అయిన.. ఈ డైలాగ్ వినగానే మీకు ఠక్కున గుర్తొస్తారు తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించారాయన. ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా బడా వ్యాపారవేత్త ఈయన.. 2014లో టీడీపీ తరపున మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు.

Malla Reddy Profile: పాలమ్మినా..పూలమ్మినా..రికార్డుల్లోకెక్కినా మల్లారెడ్డి రాజకీయ ప్రస్థానమిదే..
Telangana Minister Mallar Reddy is more famous than Chiranjeevi and Pawan Kalyan

Updated on: Dec 02, 2023 | 12:39 PM

Malla Reddy Telangana Election 2023: ఆయన మంత్రి మల్లారెడ్డి కాదు.. మాస్‌ మల్లారెడ్డి. ఆయన చేసే పనులు, మాట్లాడే మాటలు అలా ఉంటాయ్‌ మరి. ఆయన ఏం మాట్లాడినా సెన్సేషన్‌.. ఏం చేసినా ఏదో ఒక వైబ్రేషన్‌ అన్నట్టుగా ఉంటుంది. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడినా.. ఫేమస్ అయిన..’ ఈ ఒక్క డైలాగ్‌తో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ సంపాదించారు తెలంగాణ మంత్రి చామకూర మల్లారెడ్డి. ఈ . ప్రధానంగా హైదరాబాద్ కేంద్రంగా బడా వ్యాపారవేత్త ఈయన.. 2014లో టీడీపీ తరపున మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరపున మల్లారెడ్డి ఒక్కరే గెలుపొందటం విశేషం. డిగ్రీ చదువుని మధ్యలోనే ఆపేసిన మల్లారెడ్డి.. హైదరాబాద్ వేదికగా పలు విద్యాసంస్థలను స్థాపించి.. బడా బిజినెస్‌మ్యాన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. యువతలో రాజకీయ చైతన్యం నింపేందుకు పలు కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా.. ఓటు హక్కు నమోదుపై కూడా చైతన్యం కల్పించేందుకు కృషి చేశారు మల్లారెడ్డి. అలాగే ఎంతోమంది తెలంగాణ యువతకు తన వ్యాపారాలు, విద్యాసంస్థల్లో ఉద్యోగాలు కల్పించి ఉపాధిని అందించారాయన.

రాజకీయ ప్రస్థానం ఇలా..

2014 మార్చి 12న తెలుగుదేశం పార్టీలో మల్లారెడ్డి.. అదే సంవత్సరం ఏప్రిల్ 9న మల్కాజిగిరి లోక్‌సభ స్థానం నుంచి ఎంపీ అభ్యర్ధిగా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఏకైక పార్లమెంట్ సభ్యుడు సి.హెచ్ మల్లారెడ్డి. ఈయన 2016లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున మేడ్చల్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలిచారు మల్లారెడ్డి. ఇక కేసీఆర్ రెండో మంత్రివర్గంలో 2019 ఫిబ్రవరి 19న, స్త్రీ, శిశు సంక్షేమ, కార్మిక, ఉపాధి శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు మల్లారెడ్డి. కాగా, ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు 2023లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు చామకూర మల్లారెడ్డి.

మల్లారెడ్డి ఎన్నికల ప్రచారంలో తనదైన మార్క్ శైలిలో ప్రజల్లోకి వెళ్లారు. ‘పాలమ్మినా.. పూలమ్మినా.. కష్టపడినా.. ఫేమస్ అయిన..’ డైలాగ్‌తో ప్రజల్లోకి దూసుకుపోతూ.. బీఆర్ఎస్ మేనిఫెస్టోను వివరిస్తూ.. తనను గెలిపించాలని కోరారు మల్లారెడ్డి.

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం..