అప్పుల బాధలు.. మెట్రో రైలు(Metro Train) లోకోపైలట్ ప్రాణాలు తీశాయి. తీవ్ర మనోవేదనకు గురైన అతను.. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇబ్రహీంపట్నం ఎస్సై వెంకటేష్ వివరాల ప్రకారం.. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని గోల్నాకలో నివాసముండే తుంకి సందీప్‌రాజ్ నాగోలులో మెట్రోరైలు లోకోపైలట్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని కుటుంబం చేసిన అప్పులు ఎక్కువ అవడం, వాటిని తీర్చాలంటూ డబ్బులు ఇచ్చిన వాళ్లు బలవంతం చేయడంతో సందీప్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. అప్పులు ఎలా తీర్చాలా అని ఆలోచిస్తూ మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో సందీప్.. శనివారం సాయంత్రం తన తల్లికి ఫోన్ చేసి తాను మియాపూర్(Miyapur) డిపోలో నిద్రిస్తానని, ఇంటికి రానని చెప్పాడు. అనంతరం ఇబ్రహీంపట్నం చెరువు వద్దకు వెళ్లాడు. అప్పులబాధ తాళలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం ఇబ్రహీంపట్నం చెరువులో సందీప్‌రాజ్ మృతదేహం కనిపించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి.. సందీప్ రాజ్ గా గుర్తించారు. తాను ఆత్మహత్మ చేసుకుంటున్నట్లు స్నేహితుడు వెంకటేష్‌కు సందీప్‌రాజ్ వాట్సప్ మెసేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Also Read: