Liquor stores: రేపటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ.. గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని కేటాయించారంటే..

|

Nov 08, 2021 | 8:43 PM

తెలంగాణలో మద్యం దుకాణాలు పెంచుతూ ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 404 వైన్స్‎లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉండనున్నాయి...

Liquor stores: రేపటి నుంచి మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ.. గౌడ్స్, ఎస్సీ, ఎస్టీలకు ఎన్ని కేటాయించారంటే..
Liquor
Follow us on

తెలంగాణలో మద్యం దుకాణాలు పెంచుతూ ఆబ్కారీ శాఖ నిర్ణయం తీసుకుంది. కొత్తగా 404 వైన్స్‎లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కొత్తవాటితో కలిపి రాష్ట్రంలో 2,620 మద్యం దుకాణాలు ఉండనున్నాయి. వచ్చే నెల నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి రానుందని వెల్లడించింది. నూతన మద్యం దుకాణాల ఏర్పాటుకు మంగళవారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరించనుంది. జిల్లాల కలెక్టర్ల సమక్షంలో ఈనెల 20న డ్రా ద్వారా లైసెన్సుల ఎంపిక ప్రక్రియ పూర్తి పూర్తి చేయనున్నారు.

తెలంగాణళో ఎస్సీ, ఎస్టీ, గౌడ్‌లకు రిజర్వేషన్ల ప్రకారం ఇవాళ మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసింది. కమిటీ సభ్యులతోపాటు ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్లు, ఇతర అధికారుల సమక్షంలో డ్రా ద్వారా గౌడ్‌లకు 363, ఎస్సీలకు 262, ఎస్టీలకు 131 లెక్కన దుకాణాలు కేటాయించినట్లు పేర్కొంది. ఈ మూడు క్యాటిగిరీలకు 756 మద్యం దుకాణాలు కేటాయించినట్లు ఆబ్కారీ శాఖ ప్రకటించింది. మిగిలిన 1,864 మద్యం దుకాణాలు ఓపెన్‌ క్యాటగిరి కింద ఉన్నట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఉన్న గౌడ్, ఎస్సీ, ఎస్టీలు ఆర్థికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాల్లో గౌడ్‎​లకు 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5శాతం రిజర్వేషన్ల ప్రకారం దుకాణాలు కేటాయించినట్లు తెలిపారు.

గౌడ్, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా మద్యం షాపుల రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని మంత్రి అన్నారు. గతంలో రెండు బ్యాంకులు గ్యారంటీలు ఇవ్వాల్సి ఉండగా… ఇప్పుడు ఒకటే గ్యారంటీ తీసుకుంటున్నారని మంత్రి చెప్పారు. దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజు కూడా పెంచలేదని… ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే మద్యం దుకాణాలు కూడా నామమాత్రంగా పెంచామని వెల్లడించారు.

Read Also.. Etela Rajendar: బీజేపీ నేత ఈటల రాజేందర్‌కు మరో షాక్.. నోటిసులు జారీ చేసిన డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే