Hyderabad: మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌

|

Jul 31, 2021 | 6:32 AM

Liquor shops closed: తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పలు ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు బోనాల

Hyderabad: మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్.. రేపు, ఎల్లుండి మద్యం దుకాణాలు బంద్‌
liquor-shops
Follow us on

Liquor shops closed: తెలంగాణ వ్యాప్తంగా ఆషాఢ మాస బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా పలు ఏర్పాట్లు చేసింది. దీంతోపాటు బోనాల సందర్భంగా హైదరాబాద్ నగరంలో పోలీసులు పకడ్బంధీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే ఆదివారం, సోమవారం.. పాతబస్తీ బోనాల నేపథ్యంలో హైదరాబాద్ నగరం పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి ఏడాది మాదిరిగా ఈసారి కూడా మద్యం షాపులు, బార్‌ అండ్ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు తెలిపారు.

బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, రంగం కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని మద్యం, కల్లు దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ధిక్కరించి మద్యం విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం, కల్లు దుకాణలు, బార్ అండ్ రెస్టారెంట్లపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని పేర్కొన్నారు.

Also Read:

Plastic Ban: ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కోసం 8 ఏళ్ల చిన్నారి వినూత్న ప్రయత్నం.. ఏకంగా సముద్ర గర్భంలో..

GRMB Meeting: ఆగస్టు 3న గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు సమన్వయ కమిటీ భేటీ