వ్యవసాయరంగంలో సవాళ్లను అధిగమించాలి: ఉపరాష్ట్రపతి

|

May 16, 2019 | 3:23 PM

హైదరాబాద్‌: జీవితంలో ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ముందున్న సమస్యలు అధిగమించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బేగంపేటలోని అణుశక్తి విభాగం, అణు ఖనిజ డైరెక్టరేట్‌ పరిశోధన సంస్థ 70ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శాస్త్రవేత్తలతో సమావేశమైన ఆయన వారు చేస్తున్న కృషిని అభినందించారు. నాలెడ్జ్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదన్న ఉపరాష్ట్రపతి..ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థిలా ఉండాలన్నారు. కొత్త సవాళ్లను స్వీకరించి భవిష్యత్ తరాలకు మెరుగైన మార్గనిర్ధేశకాలు ఇవ్వాలన్నారు. ప్రజలకు ఉపయోగపడేలా […]

వ్యవసాయరంగంలో సవాళ్లను అధిగమించాలి: ఉపరాష్ట్రపతి
Follow us on

హైదరాబాద్‌: జీవితంలో ప్రతిక్షణం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ముందున్న సమస్యలు అధిగమించాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బేగంపేటలోని అణుశక్తి విభాగం, అణు ఖనిజ డైరెక్టరేట్‌ పరిశోధన సంస్థ 70ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శాస్త్రవేత్తలతో సమావేశమైన ఆయన వారు చేస్తున్న కృషిని అభినందించారు. నాలెడ్జ్ అనేది ఏ ఒక్కరి సొత్తు కాదన్న ఉపరాష్ట్రపతి..ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థిలా ఉండాలన్నారు. కొత్త సవాళ్లను స్వీకరించి భవిష్యత్ తరాలకు మెరుగైన మార్గనిర్ధేశకాలు ఇవ్వాలన్నారు.

ప్రజలకు ఉపయోగపడేలా వివిధ కొత్త పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలన్న ఆయన వ్యవసాయరంగంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల్లో కాలుష్యంపై అవగాహన తీసుకురావాలని, సాధ్యమైనంత వరకూ నగరాల్లో ప్రజారవాణాకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అణువిభాగం కూడా గ్రామీణ ప్రాంతాల్లో కాలుష్యం గురించి… అక్కడి  వాతావరణం, భూమిలోని మినరల్స్‌ గురించి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే వారిలో మరింత చైతన్యం వస్తుందని  వెంకయ్యనాయుడు తెలిపారు.