హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్ళే భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తన ట్విట్టర్ వేదికగా తెలిపారు. హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లే శ్రీరాముని భక్తులకు ప్రత్యేక విమానాలు అందుబాటులోకి తీసుకొచ్చింది విమానయాన శాఖ. అయోధ్య వెళ్లాలనుకునే భక్తుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి అయోధ్యకు నేరుగా ఫ్లైట్ సౌకర్యం కల్పించమని ఫిబ్రవరి 26న కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు లేఖ రాసినట్లు వివరించారు. దీనిపై స్పందించిన సింధియా ఏప్రిల్ 2 నుంచి ప్రత్యేక విమానాలు హైదరాబాద్ నుంచి అయోధ్యకు నడుపనున్నట్లు తెలిపారు.
విమానయాన కంపెనీలతో మాట్లాడిన సింధియా వారానికి మూడు రోజులు ప్రత్యేక ఫ్లైట్లు హైదరాబాద్ నుంచి అయోధ్యకు నడపాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రైవేట్ విమాన సర్వీసు సంస్థలు మంగళ, గురు, శని వారాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపాయి. ఈ సేవలు ఏప్రిల్ 2 నుంచి అందుబాటులోకి రానున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి. అడిగిన వెంటనే తమ అభ్యర్థనపై స్పందించి తెలుగు ప్రజలకు ఈ సౌకర్యాన్ని కల్పించినందుకు సింధియాకు కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు. ఈ లేఖను తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. లేఖతో పాటు హైదరాబాద్ నుంచి అయోధ్యకు బుక్ చేసుకున్న టికెట్ కూడా జతచేశారు. దీంతో బాలరాముడి దర్శనం కోసం వేచి చూస్తున్న తెలుగు వారికి మరింత సౌకర్యవంతమైన ప్రయాణం చేసేలా కేంద్రం వెసులుబాటు కల్పించినట్లైంది.
𝗚𝗼𝗼𝗱 𝗡𝗲𝘄𝘀 𝗙𝗼𝗿 𝗔𝗹𝗹 𝗦𝗵𝗿𝗲𝗲 𝗥𝗮𝗺 𝗕𝗵𝗮𝗸𝘁𝘀
I am glad to share that Hyderabad now gets direct flight connectivity to Ayodhya.
Thank you Hon’ble Union Minister for Civil Aviation Shri @JM_Scindia for accepting my request for starting a direct flight between… pic.twitter.com/vaooOEOGLK
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) March 31, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..