
రెండు రోజుల పాటు కొనసాగిన బయో ఆసియా సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. అంచనాలకు మించి పెట్టుబడులు వెల్లువెత్తాయి. హైదరాబాద్ వేదికగా 22వ బయో ఆసియా సమ్మిట్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు ముగింపు వేడుకలో పాల్గొన్నారు. ప్రపంచంలో పేరొందిన ఫార్మా కంపెనీలు, హెల్త్‌కేర్, లైఫ్ సైన్స్ మరియు బయోటెక్ కంపెనీలెన్నో హైదరాబాద్ నుంచి పని చేస్తున్నాయన్నారు.
మోదీ నేతృత్వంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందన్నారు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. బల్క్ డ్రగ్ క్యాపిటల్, వ్యాక్సిన్ క్యాపిటల్‌గా హైదరాబాద్ పురోగతి సాధించిందన్నారు. బయో ఆసియా సమ్మిట్‌ను సక్సెస్ చేసిన తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు కిషన్ రెడ్డి.
బయో సదస్సుకు అనూహ్య స్పందన వచ్చిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు . గతేడాది కంటే ఈసారి ఎక్కువ పెట్టుబడులు వచ్చాయన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 50 దేశాలకు చెందిన 3 వేల మంది ప్రతినిధుల బయో ఆసియా సదస్సుకు హాజరయ్యారు. 7వందల స్టారపట్ కంపెనీలు, 80కి పైగా ప్రముఖ సంస్థలు ఈ వేదికగా తమ ఆవిష్కరణలను పరిచయం చేశాయి.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి