వేలామంది ప్రజల సమక్షంలో పంచముఖ రుద్ర మహా గణపతి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జనం పూర్తయింది. ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నాలుగో నంబర్ క్రేన్ ద్వారా మహా గణపతిని గంగమ్మ ఒడికి చేర్చారు. చివరి రోజు మహాగణపతి దర్శనం కోసం భారీగా భక్తులు తరలివచ్చారు. ఇవాళ ఉదయం 8.18 గంటలకు ప్రారంభమైన గణనాథుని శోభాయాత్ర.. భక్తుల కోలాహలం మధ్య సందడిగా కొనసాగింది. 9 రోజులుగా మహాగణపతి దర్శనం కోసం హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. ట్యాంక్‌బండ్‌పై తుదిపూజల అనంతరం మహాగణపతి నిమజ్జన ప్రక్రియ పూర్తిచేశారు.
ఖైరతాబాద్, లక్డీకాపూల్, సైఫాబాద్, తెలుగుతల్లి ఫ్లైఓవర్, లుంబినీపార్క్ గుండా ఎన్టీఆర్ మార్గ్ వరకు ఈ శోభాయాత్ర అంత్యంత వైభవంగా… కన్నుల పండువగా సాగింది.
భారీగణనాథుడిని చూసేందుకు వందలాదిగా ప్రజలు తరలివచ్చారు. గణపతిబప్పా మోరియా నినాదాలతో హోరెత్తించారు. బైబై గణేషా అంటూ వీడ్కోలు పలుకుతున్నారు. ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం అంటే పెద్దపండగే. ప్రతీ ఏటా నిమజ్జనం రోజు భారీ గణపయ్యని చూసేందుకు వేలాది మంది తరలివస్తారు. నగరం నలుమూలల నుంచే కాదు.. పక్క జిల్లాల నుంచీ గణేషుడిని చూసేందుకు వస్తారు.
ఈసారి కూడా అదే ట్రెండ్ నడిచింది. అదీకాకుండా.. ట్యాంక్‌బండ్‌లో ఖైరతాబాద్ గణేషుడి చివరి నిమజ్జనం ఇదే. వచ్చే ఏడాది నుంచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో వేలాది మంది ప్రజలు, భక్తులు ఖైరతాబాద్ పంచముఖ గణపతిని సాగనంపారు. బప్పా మోరియా అంటూ నినదించారు. మళ్లీరా బొజ్జగణపయ్య అంటూ గంగమ్మ ఒడిచి చేరుస్తన్నారు.
ఇవి కూడా చదవండి: Kalonji Farming: కలోంజి సాగుతో ఏడాదికి లక్షల రూపాయలు సంపాదన.. ఇది ఎలా సాగు చేయాలో తెలుసుకోండి..