ప్రణీత్‌ రావు ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. అడిషనల్‌ ఎస్పీలు అరెస్ట్‌

|

Mar 24, 2024 | 10:43 AM

Praneet Rao's Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు విచారణలో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ప్రణీత్ రావు అండ్ టీమ్ ఓ ఆఫీస్‌ని ఏర్పాటు చేసుకున్నట్టు విచారణలో తేలింది.

ప్రణీత్‌ రావు ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు.. అడిషనల్‌ ఎస్పీలు అరెస్ట్‌
Praneeth Rao Arrest
Follow us on

Praneet Rao’s Phone tapping case: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు విచారణలో అనేక సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో దర్యాప్తు చేసే కొద్దీ కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి సమీపంలోనే ప్రణీత్ రావు అండ్ టీమ్ ఓ ఆఫీస్‌ని ఏర్పాటు చేసుకున్నట్టు విచారణలో తేలింది. ఈ ఆఫీస్ కేంద్రంగానే రేవంత్ రెడ్డి, ఆయన సోదరులు, బంధువుల ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు గుర్తించారు. రేవంత్ నివాసానికి కిలోమీటర్ దూరంలోనే ఓ కమర్షియల్ బిల్డింగ్‌లో ఆఫీస్ ఏర్పాటు చేసుకుని.. 2 కిలోమీటర్ల రేడియస్ వరకు ఫోన్లను ట్యాపింగ్ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది ప్రణీత్ రావు టీమ్. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు విచారణలో గుర్తించారు. ఓ మాజీమంత్రి రాసలీలల వ్యవహారాన్ని ట్యాపింగ్ ద్వారా ప్రణీత్ రావు లీక్ చేసినట్టు తేలింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక బై ఎలక్షన్ సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు గుర్తించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రత్యర్థుల డబ్బులే టార్గెట్‌గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు తేలింది. ఈ వ్యవహారంలో రాచకొండ రిటైర్డ్ ఏసీపీ ఒకరు కీలక పాత్ర పోషించినట్టు పోలీసులు తేల్చారు. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను రిటైర్డ్ ఏసీపీ సేకరించినట్టు విచారణలో తేలింది. గత డిసెంబర్ 4న ధ్వంసం చేసిన వస్తువులను ప్రణీత్‌రావు నాగోల్‌ మూసీ కాలువలో, వికారాబాద్ ఫారెస్ట్‌లో పడేసినట్లు విచారణలో తేలింది. నాగోల్‌ వంతెన కింద 6 హార్డ్‌ డిస్క్‌ల శకలాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డేటాను తిరిగి పొందేందుకు నిపుణుల సహాయం తీసుకుంటున్నారు పోలీసులు. ఇది ఫలిస్తే కీలక రహస్యాలు బయటకు వచ్చే అవకాశముందని భావిస్తున్నారు.

మాజీ పోలీసు అధికారుల ఇళ్లలోనూ సోదాలు.. ఇద్దరు అరెస్ట్..

ఈ కేసులో మాజీ పోలీసు అధికారుల ఇళ్లలోనూ సోదాలు జరగడం కలకలం రేపుతోంది. పలువరు ఇళ్లలోనూ పోలీసులు సోదాలు నిర్వహించారు. భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్న భుజంగరావు, అడిషనల్‌ ఎస్పీ తిరుపతన్న ఇళ్లలోనూ సోదాలు చేశారు. బంజారాహిల్స్‌ పీఎస్‌లో తిరుపతన్న, భుజంగరావును 8 గంటల పాటు విచారణ జరిపన అనంతరం వారిని అరెస్ట్‌ చేశారు. భుజంగరావు గతంలో ఇంటెలిజెన్స్‌ పొలిటికల్‌ వింగ్‌లో అదనపు ఎస్పీగా పనిచేశారు. ప్రణీత్‌తో కలిసి వీరిద్దరూ ట్యాపింగ్ చేసినట్టు ఆధారాలున్నాయని హైదరాబాద్‌ సీపీ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. వీరిని కోర్టులో హాజరుపరిచి జ్యూడీషియల్ కస్టడీ కోరనున్నారు. ప్రణీత్‌ రావు కస్టడీ ముగియనుండటంతో మెజిస్ట్రేట్‌ నివాసంలో హాజరుపరచనున్నారు పోలీసులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..