Hyderabad Bonalu: కార్వాన్ దర్బార్ మైసమ్మ ఉత్సవాలకి భారీ బందోబస్తు.. సిటీలో రేపటి వేడుకలు ఎక్కడెక్కడ.? ఎలా.?

|

Jul 31, 2021 | 6:37 PM

హైదరాబాద్ నగరంలోని కార్వాన్ బోనాల ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు...

Hyderabad Bonalu: కార్వాన్ దర్బార్ మైసమ్మ ఉత్సవాలకి భారీ బందోబస్తు.. సిటీలో రేపటి వేడుకలు ఎక్కడెక్కడ.? ఎలా.?
Darbar Maisamma Bonalu
Follow us on

Hyderabad Bonaluy: హైదరాబాద్ నగరంలోని కార్వాన్ బోనాల ఉత్సవాలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ ప్రజలకు పిలుపునిచ్చారు. కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయ బోనాల ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారని చెప్పిన ఆయన, అందుకోసం 300 పోలీస్ సిబ్బందిని భారీ బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఈ బోనాల ఉత్సవాల్లో బోనాలు ఎత్తుకుని వచ్చే మహిళలకు కూడా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

శనివారం కార్వాన్ ఏకే ఫంక్షన్ హాల్ లో వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీస్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులతో వెస్ట్ జోన్ డీసీపీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బోనాల ఉత్సవాలకు నగర ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఊరేగింపులో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు డిసిపి పేర్కొన్నారు. కాగా ఆదివారం సాయంత్రం సబ్జీ మండిలోని మహంకాళి దేవాలయం నుంచి ఘటాలు అంబారి (ఏనుగు) పై భారీ ఊరేగింపుగా జిరా ప్రాంతంలోని పోచమ్మ దేవాలయం ప్రాంతానికి తరలి వెళ్తాయి.

ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి కార్వాన్ దర్బార్ మైసమ్మ ఆలయంలో అమ్మవారికి పూజలు ప్రారంభమవుతాయని, అర్ధరాత్రి వరకు అమ్మవారి దర్శనాలు ఉంటాయని అందుకోసం భారీ ఏర్పాట్లు కూడా చేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. అంతేకాకుండా సోమవారం ఉదయం రంగం, బలి గంప, పోతురాజుల విన్యాసాలు కూడా ఉంటాయని, సాయింత్రం భారీ తొట్టెల ను నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా గణేష్ ఘాట్ మూసీ నది వరకు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు.

Read also: High Court: వ్యాక్సిన్ తీసుకుంటేనే అనుమతి, ఆగస్టు 9 నుంచి సెప్టెంబరు 9 వరకు పాక్షికంగా ప్రత్యక్ష విచారణ: హైకోర్టు