ఫ్లాష్ న్యూస్: కాచిగూడ ప్రమాదం.. లోకో పైలట్ కాలు తొలగింపు..!

కాచిగూడ రైలు ప్రమాద బాధితుడు.. ఎంఎంటీఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ కుడి కాలును.. వైద్యులు ఈ రోజు తొలగించారు. రెండు రోజుల క్రితం.. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్-ఇంటర్‌ సిటీ ట్రైన్స్ ఢీ కొన్న విషయం తెలిసిందే. ఎంఎంటీఎస్‌కు లోకో పైలెట్‌గా ఉన్న చంద్రశేఖర్ సిగ్నల్ చూసుకోకుండా ముందుకు వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని.. రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. మరోవైపు హై లెవల్ కమిటీ కూడా ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది. అయితే.. ప్రమాదం జరిగిన రోజు.. క్యాబిన్‌లో […]

ఫ్లాష్ న్యూస్: కాచిగూడ ప్రమాదం.. లోకో పైలట్ కాలు తొలగింపు..!

Edited By:

Updated on: Nov 14, 2019 | 7:27 PM

కాచిగూడ రైలు ప్రమాద బాధితుడు.. ఎంఎంటీఎస్ లోకో పైలెట్ చంద్రశేఖర్ కుడి కాలును.. వైద్యులు ఈ రోజు తొలగించారు. రెండు రోజుల క్రితం.. కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ఎంఎంటీఎస్-ఇంటర్‌ సిటీ ట్రైన్స్ ఢీ కొన్న విషయం తెలిసిందే. ఎంఎంటీఎస్‌కు లోకో పైలెట్‌గా ఉన్న చంద్రశేఖర్ సిగ్నల్ చూసుకోకుండా ముందుకు వెళ్లడంతోనే ప్రమాదం జరిగిందని.. రైల్వే అధికారులు ప్రాథమికంగా నిర్థారించారు. మరోవైపు హై లెవల్ కమిటీ కూడా ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తోంది. అయితే.. ప్రమాదం జరిగిన రోజు.. క్యాబిన్‌లో చంద్రశేఖర్ ఇరుక్కున్నాడు.

చంద్రశేఖర్‌ను బయటకు తీయడానికి దాదాపు 8 గంటల సేపు రెస్క్యూ టీం శ్రమించాల్సి వచ్చింది. మొత్తానికి అతన్ని బయటకు తీసి.. అనంతరం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే లోకో పైలట్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ముఖ్యంగా కాలు ట్రైన్‌లో ఇరుక్కుపోయింది. దీంతో కాలుకు రక్తప్రసరణ సరిగా కాకపోవడంతో.. డాక్టర్లు పూర్తి స్థాయిలో ట్రీట్‌మెంట్ అందించే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో ఈ రోజు అతని కుడి కాలును తొలగించారు.