Alok Aradhe: హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం.. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సమక్షంలో..

|

Jul 23, 2023 | 11:31 AM

Hyderabad: హైదరాబాద్ న్యూస్, జూలై 23: తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ తమిళిసై.. జస్టిస్ అలోక్ ఆరాధేతో..

Alok Aradhe: హైకోర్ట్ చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధే ప్రమాణ స్వీకారం.. గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ సమక్షంలో..
Alok Aradhe
Follow us on

హైదరాబాద్ న్యూస్, జూలై 23: తెలంగాణ గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ అరాధే ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరిగిన ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ తమిళిసై.. జస్టిస్ అలోక్ ఆరాధేతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి శ్రీనివాస్ గౌడ్ సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

కాగా, సుప్రీంకోర్టు కొలిజియం సిఫారసుల మేరకు రాష్ట్ర హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా అలోక్ ఆరాధే నియామకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రఛూడ్‌తో సంప్రదింపుల తర్వాత జస్టిస్ ఆలోక్ అరాధేను తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా నియమించారు. ఈ నియమానికి ముందు ఆరాధే కర్ణాటక హైకోర్టులో జడ్జిగా విధులు నిర్వరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..