Jubilee Hills By Election Exit Poll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. ఎగ్జిట్‌పోల్స్‌ ఏం చెబుతున్నాయంటే..?

జూబ్లీ హిల్స్‌లో పొలిటికల్ థ్రిల్లర్‌ కొనసాగింది మూడు పార్టీలు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డాయి. కాంగ్రెస్‌ను తొలి దెబ్బ కొట్టి సత్తా చాటాలని కారు పార్టీ ప్లాన్ చేస్తే.. ఇక్కడ కూడా తమదే పైచేయి అని నిరూపించాలని కాంగ్రెస్ వ్యూహాలు రచించింది. ఇక విక్టరీ కోసం తమదైన పంథాను అనుసరించాలని కమలనాథులు భావించారు. పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి..

Jubilee Hills By Election Exit Poll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. ఎగ్జిట్‌పోల్స్‌  ఏం చెబుతున్నాయంటే..?
Jubilee Hills Bypoll

Updated on: Nov 11, 2025 | 7:44 PM

జూబ్లి హిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. 5 గంటల లోపు క్యూ లైన్ ఉన్నవాళ్లకు ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. తాజాగా ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ అందుబాటులోకి వచ్చాయి.  మెజార్టీ సర్వేలు కాంగ్రెస్‌కు పాజిటివ్‌గా చూపిస్తున్నాయి.

HMR సర్వే ప్రకారం కాంగ్రెస్‌కు 48.31 శాతం, బీఆర్‌ఎస్‌కు 43.18 శాతం, బీజేపీ 5.84శాతం ఓట్లు వచ్చే చాన్స్ ఉంది.

చాణక్య స్ట్రాటజీస్‌ సంస్థ..  కాంగ్రెస్‌కు 46శాతం, బీఆర్‌ఎస్‌కు 43 శాతం, బీజేపీకి 6 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది.

స్మార్ట్‌ పోల్‌ సర్వే .. కాంగ్రెస్‌కు 48.2శాతం, BRSకు 42.1 శాతం, BJPకి 7.6 శాతం, ఇతరులకు 2.1శాతం ఓట్లు పోలయ్యే అవకాశముందని తెలిపింది.

సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనారోగ్య కారణాలతో మృతి చెందడంతో జూబ్లి హిల్స్ ఉప ఎన్నిక అనివార్యమైంది. బీఆర్‌ఎస్‌ నుంచి మాగంటి గోపీనాథ్‌ భార్య సునీత, కాంగ్రెస్‌ తరపున నవీన్‌ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్‌రెడ్డి పోటీ చేశారు. గెలుపుపై 3 ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 14న రానున్నాయి.