Joker Software: జోకర్ సాఫ్ట్‌వేర్ మరింత భయపెడుతోంది. ఈ సాఫ్ట్‌వేర్‌తో యువత తీవ్రంగా నష్టపోతోంది. ఇప్పటికే ఈ సాఫ్ట్‌వేర్‌ను గూగుల్ ఐదు సార్లు డిలీట్ చేసింది. అయితే మెట్రో నగరాలను జోకర్ సాఫ్ట్‌వేర్ ఇప్పటికే తీవ్రంగా కుదిపేస్తోంది. మొబైల్స్, డెస్క్‌టాప్‌లో ప్రత్యక్షమవుతోంది. పొరపాటున జోకర్ సాఫ్ట్‌వేర్ ఓపెన్ చేసినట్లయితే సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోవాల్సిందేనని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు. దీని ద్వారా మీ వ్యక్తిగత సమాచారం మోసగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుందని హెచ్చరించారు. బ్యాంకు వివరాల నుంచి వ్యక్తిగత ఫోటోల వరకు మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తాయని అన్నారు. జోకర్ సాఫ్ట్‌వేర్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయరాదని ఆయన సూచించారు.
కాగా, ఇటీవల కాలంలో సైబర్ నేరగాళ్లు రకరకాల టెక్నాలజీనీ వాడుకుంటూ ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు. ఫోన్ కాల్స్, మీ మొబైల్ నెంబర్‌కు లింక్‌లతో కూడిన మెసేజ్‌లు పంపిస్తుంటారు. పొరపాటన ఆ లింక్‌ను క్లిక్ చేసినా మీరు తీవ్రంగా మోసపోవాల్సిందేనని వెల్లడించారు. టెక్నాలజీని ఉపయోగించి కొత్త కొత్త మార్గాల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. క్రిడిట్ కార్డులు ఇస్తామని, క్యాష్ బ్యాక్ వచ్చిందనే నెపంతో వ్యక్తిగత డేటా, బ్యాంక్ ఖాతాలో సొమ్మును ఎత్తుకుపోతున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఉన్న సైబర్ నేరస్తులు మన నెట్టింట్లో ప్రవేశించి మన బ్యాంక్ ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. ఇలాంటి మోసాలు ఎన్నో జరిగాయి. సైబర్ నేరాలు పెరిగిపోతుండటంతో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. బ్యాంకు ఖాతాల విషయంలో, మీ వ్యక్తిగత వివరాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. బ్యాంకు విషయాలలో అధికంగా మోసాలు జరుగుతున్నాయని, అందుకంటే లేనిపోని లింక్‌లను పంపుతూ వ్యక్తిగత వివరాలు రాబడుతూ బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బులను దోచేస్తున్నారని అన్నారు. ఎవ్వరు కూడా ఫోన్‌లు చేసి మీ వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు తదితర వివరాలు అడిగినా ఎట్టిన పరిస్థితుల్లో చెప్పరాదని హెచ్చరించారు.